క్రికెట్, టెన్నిస్ లాంటి క్రీడాకారులేనా, ప్రభుత్వాలకి వేరే ఆటలు, వాళ్ళ ప్రతిభలు కనపడవా అనే వారికి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అతీతం అని తెలుసుకోవాలి... 10 ఏళ్ళ బాలుడు స్కేటింగ్ లో వరల్డ్ రికార్డు సృష్టిస్తే ప్రోత్సహించారు... అర్చరీలో ప్రతిభ చూపించన వారిని ప్రోత్సహించారు... ఇప్పుడు కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకా లు సాధించిన మన రాష్ట్ర క్రీడాకారులని ప్రోత్సహించారు...
గుంటూరుకు చెందిన రాగాల వెంకట రాహుల్, వరుణ్‌తో పాటు, విజయనగరంకు చెందిన మహిళా వెయిట్‌లిఫ్టర్ మత్స సంతోషి, కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాలు సాధించారు. వీరు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిసారు...
ఈ సందర్భంగా చంద్రబాబు.. రాహుల్‌కు రూ. 15 లక్షలు, వరుణ్‌కు రూ. 10 లక్షలు, సంతోషికి రూ. 10 లక్షల ప్రోత్సాహకం ప్రకటించారు. వారికి ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాహుల్ తండ్రికి 2 ఎకరాల పొలం ఇస్తున్నట్లు సీఎం చెప్పారు. రాహుల్ కోచ్ మాణిక్యాలరావుకు కూడా రూ. 5 లక్షల ప్రోత్సాహకం ప్రకటించారు...
కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్స్‌లో స్వర్ణ పతకాలు సాధించినా ఎవరూ పట్టించుకోలేదని, చంద్రబాబు మమ్మల్ని గుర్తించి, సన్మానించి, మాకు గుర్తింపు ఇచ్చినందుకు ఆయనకు రుణపడి ఉంటామని, రాష్ట్రానికి మరిన్ని పతకాలు తెచ్చి పెడతామన్నారు...