ఎస్సీ, ఎస్టీల జీవితాల్లో సూర్యుడిలా ఉదయించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమందరికి కొత్త వెలుగు ప్రసాదించారని ఐఐటీ-జేఈఈ ర్యాంకర్లు తమ అభిమానాన్ని వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీల కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారని, తాము ప్రతిభ చాటుకునేందుకు మీరిస్తున్న ప్రోత్సాహం మరువలేనిదని కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్ధులు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతూ ఐఐటీ-జేఈఈ మెయిన్స్, పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్ధులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అభినందించారు. 

cbn students 05052018

రెసిడెన్షియల్ పాఠశాలలకు చెందిన 216 మంది విద్యార్ధులు ఐఐటీ-జేఈఈ మెయిన్స్‌లో అర్హత సాధించడం తనకు గర్వకారణంగా వుందని ముఖ్యమంత్రి అన్నారు. ఐఐటీ-జేఈఈ మెయిన్స్‌లో జనరల్ కటాఫ్ కన్నా ఎక్కువ మార్కులు సాధించిన కె. శ్రీకాంత్, కె. అమృత, డి. లావణ్య, భూక్యా లలిత, టి. జీవిత, పి. కోటి, బి. అశోక్ కుమార్, నిరూప, రవికుమార్‌లను పేరుపేరునా భుజంతట్టి ముఖ్యమంత్రి అభినందించారు. 140 మంది విద్యార్ధులు పదో తరగతి పరీక్షల్లో పదికి పది జీపీఏ సాధించి మిగిలిన విద్యార్ధులకు స్ఫూర్తిదాయంగా నిలిచారని ప్రశంసించారు. ఈ ఏడాది ర్యాంకర్ల సంఖ్య వందల్లో వుంటే, వచ్చే ఏడాది ఈ సంఖ్య వేలల్లో వుండాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

cbn students 05052018

పేద విద్యార్ధుల అందరికీ కార్పొరేట్ స్థాయి విద్యను, నాణ్యమైన విద్యను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని, చదువుకునే తెలివితేటలు-సామర్ధ్యం మీదని, ప్రోత్సహించే బాధ్యత తమదని అన్నారు. రాష్ట్రంలో మరిన్ని రెసిడెన్షియల్ పాఠశాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. ప్రతి పేద విద్యార్ధి రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యను అభ్యసించడం ద్వారా నాణ్యమైన విద్య అందుకోవాలనేదే తన సంకల్పమని అన్నారు.

దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు విదేశాల్లో సైతం చదువుకునేందుకు ఒకొక్కరికి రూ. 15 లక్షలు వరకు ఆర్ధిక సాయం చేస్తున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. పేద పిల్లలు చదువుకుంటే సమాజంలో ఆర్ధిక అసమానతలు వాటంతటవే తొలిగిపోతాయన్నారు. అవకాశాలు ఇస్తే ఎవరైనా రాణిస్తారనే విషయాన్ని మీరంతా మరోసారి నిరూపించారని విద్యార్ధులను ఉద్దేశించి ముఖ్యమంత్రి చెప్పారు. విద్యార్ధుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కూడా తన అభినందనలను తెలిపారు. పిల్లలకు ఆస్తులు ఎంత ఇచ్చామనేది ముఖ్యం కాదని, ఎంత బాగా చదువు-సంస్కారం నేర్పామనేదే ప్రధానమని ముఖ్యమంత్రి అన్నారు. ఐఐటీ అంటే ఆంధ్రప్రదేశ్ అనేలా భవిష్యత్‌కు బాటలు వేస్తున్నట్టు చెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read