చాలా రోజుల తరువాత, అసెంబ్లీలో ఈ రోజు చంద్రబాబు నిప్పులు కురిపించారు. కేంద్రం చేస్తున్న మోసం వివరిస్తూ, మధ్యలో బీజేపీ సభ్యలకు చురకలు అంటిస్తూ, ఇది మా ఆంధ్రలు ఆవేదన అంటూ, తీవ్రంగా స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన బీజేపీని ఈ తరాలే కాదు భవిష్యత్తు తరాల ప్రజలు కూడా క్షమించరని అన్నారు. బుధవారం అసెంబ్లీలో ప్రత్యేక హోదా, రాష్ట్ర పునర్విభజన చట్టం పై కేంద్ర వైఖరిని నిరసిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు చంద్రబాబు. విభజన చట్టంలోని హామీలు నెరవేర్చాలని అనేక సార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని, పలువురు కేంద్రమంత్రులు, అధికారులను స్వయంగా కలిసి సంప్రదింపులు జరిపినా, వివిధ రూపాల్లో నిరసనలు తెలిపి ఒత్తిడి పెంచినా కేంద్రం తన తీరును మార్చుకోకుండా మొండిగా వ్యవహరించడాన్ని శాసనసభ తీవ్రంగా గర్హిస్తున్నదని చంద్రబాబు అన్నారు.

cbn 19092018 2

తీర్మానం ప్రవేశపెట్టిన తర్వాత భాజపా సభాపక్ష నేత విష్ణుకుమార్‌ రాజు మాట్లాడుతూ, సీఎం చంద్రబాబు ఏదైనా చాలా పర్‌ఫెక్ట్‌గా చెబుతారని, గుండెల్లోకి వెళ్లేలా చెబుతారని అన్నారు. దీనిపై చంద్రబాబు జోక్యం చేసుకుంటూ.. తాను చెప్పినదాంట్లో ఏమాత్రం అసత్యం లేదన్నారు. చట్టంలో పేర్కొన్న వాటిలో 90శాతం చేసేశామని భాజపా నేతలు అనడం దారుణమన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై అడ్డంగా మాట్లాడితే మాత్రం ప్రజలు ఊరుకోరు. చాలా కోపంగా ఉన్నారు. కేంద్రం ఏపీ పట్ల చూపుతున్న వివక్ష వైఖరిని నేటి తరాలే కాకుండా భావితరాలు కూడా క్షమించవన్నారు. కేంద్రం వైఖరితో పుట్టబోయే వాళ్లకు కూడా నష్టం జరుగుతుందని సీఎం ఆవేదన వ్యక్తంచేశారు.

cbn 19092018 3

కేంద్రం వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీలో తాము ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరచాలని భాజపా ఎమ్మెల్యేలను ముఖ్యమంత్రి కోరారు. ఈ గడ్డపై పుట్టి ఉంటే కేంద్రం వైఖరిని నిరసిస్తూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరచాలని కోరారు. ఏపీ విభజన హామీల సాధన కోసం తాను చేస్తున్న పోరాటం కేంద్రంపైనేనన్నారు చంద్రబాబు. ఏపీ ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నానని, అంతేతప్ప తన స్వార్థం కోసం కాదన్నారు. తన పోరాటం భావితరాల భవిష్యత్తు కోసమని, ఈ గడ్డపై పుట్టిన ప్రతిఒక్కరూ ఈ పోరాటాన్ని స్వాగతించాలలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని, నరనరాన ఆ బాధ ఉందని, ఈ తరుణంలో ఏపీలోని భాజపా నేతలు కేంద్రం వైఖరిని నిరసించాలని కోరారు. ఆంధ్రుడనుకొనే ప్రతి వ్యక్తీ కేంద్రం వైఖరిపై బొబ్బిలి పులిలా తిరగబడాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read