ఎమ్మెల్యేలు బొల్లినేని రామారావు, పెందుర్తి వెంకటేశ్‌పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుపతి విమానాశ్రయంలో అధికారుల పట్ల దురుసుగా రామారావు వ్యవహరించగా.. తన నియోజకవర్గంలో ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేశ్‌ అధికారులకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అధికారుల తీరు పట్ల ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరించడం సరికాదని సీఎం హితవు పలికారు. ఎమ్మెల్యేల చర్యలు పార్టీ ప్రతిష్ఠ పెంచేలా ఉండాలి తప్ప అధికారంలో ఉన్నామని ఇష్టానుసారం వ్యవహరించి పార్టీ ప్రతిష్ఠ దిగజారిస్తే ఉపేక్షించబోనని ముఖ్యమంత్రి హెచ్చరించారు. ఎదుటివారికి గౌరవం ఇస్తేనే తమ గౌరవం పెరుగుతుందని ఆలోచించాలని ఆయన సూచించారు. మరోవైపు, తాను నిన్న చేసిన వ్యాఖ్యలకు గాను ఎమ్మెల్యే బొల్లినేని రామారావు క్షమాపణ చెప్పారు.

cbn mla 27072018 2

రేణిగుంట ఎయిర్ పోర్టులో చిత్తూరు జాయింట్ కలెక్టర్ గిరీషా, రేణిగుంట తహసీల్దారు నర్సింహులుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ, అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఆపై జరిగిన దానికి చింతిస్తున్నట్టు తెలిపారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి, ఆయన తండ్రి దేవెగౌడ తిరుమల వెంకన్న దర్శనానికి వచ్చిన సందర్భంగా ఈ ఘటన జరిగింది. ఎమ్మెల్యే బొల్లినేని వారికి స్వాగతం చెప్పేందుకు రాగా, కొందరు సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నట్టు తెలుస్తోంది.

cbn mla 27072018 3

ప్రొటోకాల్ పాటించడం లేదని ఆరోపించిన ఆయన, తనను పక్కన బెట్టారని మండిపడుతూ, తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించిన అధికారులపైనా చిందులేశారు. తహసీల్దారుపై తిట్లపురాణానికి దిగిన ఆయన, సీఎం చంద్రబాబుకు చెప్పి, మీ కథ తేలుస్తానని హెచ్చరించారు. జరిగిన ఘటనతో అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. బొల్లినేని వైఖరిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన రెవెన్యూ ఉద్యోగులు ఆయన క్షమాపణ చెప్పాల్సిందేనని పట్టుబట్టడంతో, బొల్లినేని జరిగిన దానికి చింతిస్తున్నట్టు తెలిపారు. దీంతో వివాదాన్ని ఇంతటితో వదిలేద్దామని తహసీల్దారు నరసింహులు తోటి ఉద్యోగులకు సర్దిచెప్పారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read