పార్టీ నేతలపై తెలుగుదేశం అధినేత, సీఎం చంద్రబాబు కొరడా ఝులిపించారు. నియోజకవర్గాల్లో మందకొడిగా సాగుతున్న పార్టీ సభ్యత్వ నమోదుపై ఇన్‌ఛార్జిలకు గట్టి క్లాస్‌ తీసుకున్నారు. వ్యక్తిగత పనులుంటే ఎన్నికలు కూడా వాయిదా పడతాయని భావిస్తున్నారా అంటూ నిలదీశారు. ‘‘గట్టిగా తిడితే ప్రజల్లో చులకన అవుతారని ఊరుకుంటున్నా. తిట్టకపోతుంటే మరీ మితిమీరి ప్రవర్తిస్తున్నారు’’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజావేదిక హాల్‌లో చంద్రబాబు అధ్యక్షతన పార్టీ సమన్వయ కమిటీ సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. ఇందులో సభ్యత్వ నమోదు పై చర్చ చేపట్టారు. జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు వివరాలు నేతలు వెల్లడించారు.

cbn party 21122018 2

సభ్యత్వ నమోదు మొదటి 3 స్థానాల్లో పశ్చిమగోదావరి, కర్నూలు, కృష్ణ జిల్లాలు ఉండగా, నియోజకవర్గాల్లో అత్యధికంగా పీలేరు, అత్యల్పంగా నెల్లూరు గ్రామీణంలో సభ్యత్వం నమోదైంది. శ్రీకాకుళం జిల్లా నుంచి వరుసగా అన్ని నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు విశ్లేషణ చేశారు. నేతలు సరిగా సభ్యత్వ నమోదుకు హాజరుకాకపోవటం పై ముఖ్యమంత్రి చంద్రబాబు మండిపడ్డారు. మంత్రి అచ్చెన్నాయుడు ఈ భేటీకి రాకపోవడంపై చంద్రబాబు అసహనం వ్యక్తంచేశారు. జిల్లాలో జరిగిన గ్రామ వికాసం కార్యక్రమంలో సైతం మంత్రి సరిగ్గా పాల్గొనడం లేదని వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా నేతలకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైందని వ్యాఖ్యానించారు. సమన్వయ కమిటీ సమావేశానికి అయ్యన్న, శిద్ధా, మోదుగుల, జేసీ ప్రభాకర్‌రెడ్డి గైర్హాజరు కావడంపై బాబు అసహనం వ్యక్తం చేశారు. సీనియర్లు కూడా పదే పదే చెప్పించుకోవడం సరికాదన్నారు.

cbn party 21122018 32

సమన్వయకర్తలను నియమించకపోవడమేంటని నేతలను ప్రశ్నించారు. సమయం దొరకడం లేదని కొందరు నేతలు చెబుతున్నారని.. తనకు దొరికిన సమయం వాళ్లకు దొరకడం లేదా అన్నారు. ప్రజలకు పనులు చేసి మెప్పు పొందాలి కానీ పార్టీని మోసం చేస్తూ కాదని హితవు పలికారు. ఎన్నికలు వస్తున్నాయనే విషయాన్ని కూడా కొందరు గమనించడం లేదని, పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు సీరియస్‌గా తీసుకోలేని వారికి మళ్లీ అన్ని పనులూ జరగాలంటే ఎలా అని ప్రశ్నించారు. చిన్నపిల్లలకు చెప్పినట్లు చెప్తున్నా కొందరు అర్ధం చేసుకోవడం లేదని, ఇలాగే ఉంటామంటే ఇక ఇంట్లోనే కూర్చుంటారంటూ హెచ్చరించారు. రాబోయే 6 నెలలు తాను కఠినంగానే ఉంటానని స్పష్టంచేశారు. రాబోయే ఆరు నెలలు తాను కఠినంగా ఉంటాననీ, నేతలందరూ ఎమర్జెన్సీ తరహాలో పనిచేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రజలకు సేవ చేసుకుని మెప్పు పొందాలనీ, పార్టీని మోసం చేయవద్దని హితవు పలికారు. తిట్టకపోతే మితిమీరి ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read