నిన్న అమిత్ షా రాసిన లేఖ పై, ఈ రోజు కూడా చంద్రబాబు స్పందించారు.. ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు, ఒక రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ, మీకు ఇచ్చిన డబ్బులు వేరే వాటికి ఉపయోగించుకుంటున్నారేమో, అంటూ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని అవినీతి చేస్తున్నాం అంటూ లేఖ రాయటం పై, తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు... తనను నిందించేముందు బీజేపీ నేతలు తమ అవినీతి చరిత్రను చదువుకోవాలని సూచించారు... ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులతో ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు...
ఆంధ్రప్రదేశ్ లో అవినీతి పాలనసాగుతున్నది అంటూ, రాజకీయ దురుద్దేశాలతోనే ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలిగిందని అమిత్ షా లాంటి వ్యక్తి అబాద్ధాలు చెప్తూ లేఖపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. "ప్రజల ఆకాంక్షను తెలియజేస్తూ ఎన్డీఏ నుంచి బయటికొస్తే నా పై ఆరోపణలు చేస్తారా? మరి అమిత్ షా కుమారుడు జై షా అక్రమాల మాటేమిటి? కొడుకుపై వచ్చిన ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పరా? అన్నీ వ్యవస్ధలనూ కేంద్రప్రభుత్వం భ్రష్టుపట్టించంది. అందరికీ నీతులు చెప్పే బిజెపి యుపిలో ఒక రాజ్యసభ స్ధానం కోసం ఎందుకు దిగజారింది. గుజరాత్ లో రాజ్యసభ సీటు కోసం ఏం చేశారో తెలీదా ? రాజ్యసభ సీటు కోసం మనకు ఇద్దరు ఎంఎల్ఏలు మాత్రమే తక్కువన్నా, మూడో రాజ్యసభ సీటుకు పోటీ పెట్టలేదన్న విషయం అందరూ గ్రహించాలని" చంద్రబాబు అన్నారు...
ఇది అమిత్ షా కొడుకు పై ఉన్న ఆరోపణలు... 2014లో బీజేపీ అధికారంలోకి రావడంతోనే జయ్ షాకు చెందిన రెండు కంపెనీల టర్నోవర్ అమాంతం పెరిగిపోయిందని, అంతేకాకుండా పలు ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి ఆయన కంపెనీలకు భారీ రుణాలు అందాయని 'దవైర్.ఇన్’ వెబ్సైట్ ఓ కథనంలో పేర్కొంది... జయ్ షాకు చెందిన టెంపుల్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ గత కొన్ని సంవత్సరాలుగా నష్టాల్లో కొనసాగుతోందని, కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కంపెనీకి రూ. 15 కోట్ల రుణం అందిందని, దీంతో 2015లో ఆ కంపెనీ టర్నోవర్ రూ. 80 కోట్లకు పెరిగిందని వెబ్సైట్ తన కథనంలో పేర్కొంది. ఆ తర్వాత నష్టాలతో ఆ కంపెనీని మూసినట్టు తెలుస్తోందని తెలిపింది. .. జయ్ షాకు చెందిన మరో కంపెనీ.. గుజరాత్ కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి రూ. 25 కోట్ల రుణం తీసుకున్నదని, అంతేకాకుండా అదే కంపెనీని పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థగా మార్చి.. కేంద్ర విద్యుత్ శాఖ నుంచి రూ. 10.35 కోట్లు రుణం తీసుకున్నదని ఆ వెబ్సైట్ వెల్లడించింది.