దేవాలయాల పై జరుగుతున్న వరుస ఘటనల్లో, తెలుగుదేశం ప్రమేయం ఉంది అంటూ డీజీపీ చేసిన వ్యాఖ్యల పై చంద్రబాబు మండి పడ్డారు. సజ్జల స్క్రిప్ట్ ఇచ్చి, జగన్ డైరెక్ట్ చేస్తే, డీజీపీ ఇక్కడకు వచ్చి యాక్షన్ చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఈ రోజు తిరుపతి నియజకవర్గ సమీక్షలో చంద్రబాబు పాల్గున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేసారు. దేవాలయాల పై జరుగుతున్న ఘటనల వెనుక వైసీపీ వాళ్ళు ఉన్నారని, వాటిని బయట పెట్టిన టిడిపి వారి పై కేసు పెట్టటం ఏమిటి అని చంద్రబాబు అన్నారు. కర్నూల్ ఘటనలో వైసీపీ నేత ప్రమేయం ఉందని తెలియదా అని చంద్రబాబు అన్నారు. మేము రామతీర్ధం వెళ్తే, నా మీద, మన నాయకుల మీద కేసులు పెట్టారని, మరి అంతకు ముందు వెళ్లి రెచ్చగొట్టి వచ్చిన విజయసాయి రెడ్డి పై ఎందుకు కేసులు పెట్టలేదని నిలదీశారు. కర్నూలు జిల్లా ఓంకార క్షేత్రంలో పూజారులపై ఛర్నాకోలతో హింసించింది ఎవరని చంద్రబాబు అన్నారు. సిసి కెమెరాలు పెట్టేశాం, కమిటీలు వేసేశాం అని డీజీపీ తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నారు. అన్యమత ప్రచారాలు జరుగుతుంటే, బలవంతపు మతమార్పిళ్లు చేస్తుంటే ఏమి చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. చివరకు తిరుమలలో కూడా అన్యమత ప్రచారం చేసే దాకా వెళ్ళారని చంద్రబాబు అన్నారు. ఇవి ప్రశ్నిస్తుంటే తప్పా అని చంద్రబాబు ప్రశ్నించారు.
అబ్ధుల్ సలాం కోసం తామే పోరాడాం అని, దళితుల పై దాడులు జరుగుతుంటే తామే పోరాడామని, మేము ధర్మం కోసం మాట్లాడుతుంటే, ఇష్టం వచ్చిన్నట్టు ప్రచారం చేస్తున్నారని అన్నారు. దేవాలయాల పై జరుగుతున్న ఘటనలకు రాజకీయాలతో సంబంధం లేదు, కుట్ర లేదు, ఇవన్నీ జంతువులు, పిచ్చి వాళ్ళు చేస్తున్నారని చెప్పిన డీజీపీ, కేవలం రెండు రోజుల్లో ఎందుకు మాట మార్చారని చంద్రబాబు ప్రశ్నించారు. భక్తుల మనోభోవాలతో ఆటలు ఆడుకుంటూ, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న మంత్రులను ఏమి చేసారని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి మతమార్పిళ్లను ప్రోత్సహిస్తూ, నాటకాలు ఆడుతున్నారని, ఇప్పుడు ఇంకో నాటకం మొదలు పెట్టారని అన్నారు. గోపూజ డ్రామా అంటూ మొదలు పెట్టారని, గతంలో గంగలో మునిగిన డ్రామా ప్రజలు ఇంకా మర్చిపోలేదని చంద్రబాబు అన్నారు. సొంత బాబాయ్ కేసు తేల్చలేక టిడిపి చేసింది అన్నారు. కోడి కత్తి టిడిపి చేసింది అన్నారు. ఇప్పుడు రామతీర్ధం కూడా టిడిపి అంటున్నారు. వీళ్ళకు పట్టుకోవటం చేతకాక, టిడిపి పైన నిందలు వేస్తున్నారని చంద్రబాబు అన్నారు.