పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఎంత వల్గర్ గా మాట్లాడారో మనం చూశాం. ఇతను ఇప్పుడెక్కడ ఉన్నాడు..? డీజీపీ ఇంట్లో ఉన్నాడా, లేక జగన్ రెడ్డి ఇంట్లో ఉన్నాడా? ఎందుకీ రాయల్ ట్రీట్ మెంట్..? మా ఇళ్లపైకి రాత్రిళ్లు వందలాది పోలీసులను పంపి, గోడలు దూకించి అరెస్ట్ లు చేయిస్తారా..? ముందస్తు నోటీసులు కూడా ఇవ్వరా..? మేం సంఘ విద్రోహ శక్తులమా..? మీకు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేదా..? మేం ఎవరినైనా చంపేశామా..? దేవినేని ఉమా మహేశ్వర రావును అనేక పోలీస్ స్టేషన్లను మార్చిమార్చి తిప్పారు. ఆయన ఏం చేశారో ఇంతవరకు చెప్పలేదు. పోలీసుల్లో కొందరికి కనీసం సిగ్గనిపించడం లేదా..? ఒక బూతుల మంత్రి, రౌడీ మంత్రి ఏం మాట్లాడారో చూశాం. ఇంటికొచ్చి కొడతానని దేవినేని ఉమామహేశ్వరరావుని ఒక మంత్రి అంటాడా...? నాపై కూడా దుర్భాషలు మాట్లాడాడు. ఏంటి నీ అహంభావం..? ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి. ఉన్మాది సపోర్ట్ చేస్తున్నంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా..? ఇన్నాళ్లూ ప్రజా సేవలో ఉండి మీ దగ్గర దెబ్బలు తినడానికి మేం ఇక్కడ ఉన్నామా...? ప్రజలకు సేవ చేయడానికి మేం ఉన్నాముగాని, మీ దగ్గర దెబ్బలు తినడానికి కాదు. అనంతపురంలో వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటిపైకి వెళతాడా...? పోలీసులు తలుపులు తీసి అతని దౌర్జన్యాలకు సహకరిస్తారా..? సిగ్గులేదా మీకు...? ఇది డెకాయిట్ విధానం కాదా...? డీజీపీ సమాధానం చెప్పాలి. వైసీపీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ఎస్పీని ఇష్టారాజ్యంగా మాట్లాడితే, ఆయనపై ఎలాంటి కేసు పెట్టరా అని ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించాడు. తన ఇంట్లో తలుపులు తీసిన పోలీసులను ప్రశ్నించాడని, జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసులు పెట్టారు, మరి జిల్లా ఎస్పీని నిందించిన ప్రసన్నకుమార్ రెడ్డిపై ఎందుకు కేసులు పెట్టరని ఆయనే నిలదీశాడు. దీనికి డీజీపీ దీనికి సమాధానం చెప్పాలి.
డీజీపీ, హోం మినిస్టర్, ముఖ్యమంత్రి ఒకే మతం వారు ఉంటే ఏమౌతుంది...? నేను డైరెక్ట్ గా అడుగుతున్నా. మీరంతా కలిసి కుట్రపన్ని పద్ధతి లేని రాజకీయాలు చేస్తారా...? ప్రజాజీవితం అంటే మీ ఇష్టం కాదు. మీ ఇంట్లో ఉంటే అది మీ ఇష్టం. ప్రజలకు సేవ చేసేప్పుడు ప్రజాజీవితం ఇది. దేవాలయాలపై 150 దాడులు జరిగాయి. దాడులు చేసిన వారిపై కేసులు పెట్టకుండా, వారిని పట్టుకోవడం చేతకాక, లాలూచీపడి, చివరకు ప్రశ్నించిన మాపై కేసులు పెడతారా...? ఎవరిని బెదిరిస్తారు...? మీరేమైనా మోనార్క్ అనుకుంటున్నారా...? అందరినీ సమానంగా చూడాలి. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి వెనుక ఉన్నదెవరు..? అతని వెనుక ఎవరి బంధువులు ఉన్నారు..? కడపలో బ్యాంక్ అకౌంట్ అతనికి ఎందుకు ఉంది..? రహస్యంగా ఆయనను ఎందుకు విచారిస్తున్నారో సమాధానం చెప్పాలి. వీడియోలు, రికార్డులు లేవా సాక్ష్యంగా...? ఒక మతంపై కక్షగట్టినట్లు మీరు బిహేవ్ చేస్తుంటే, మేము అడగటం తప్పా...? టీడీపీ సెక్యులర్ పార్టీ అని చెప్పాం. అదే సమయంలో రాముడి తల తీసేసినా, దేవాలయాలపై దాడులు జరిగినా, విగ్రహాల విధ్వంసం జరిగినా మేం ప్రశ్నించకుండా ఉండాలని మీరు అనుకుంటున్నారా...? నిన్న కూడా సీఎం జగన్ క్రిస్టియన్లతో నాకు వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టించి నన్ను క్షమాపణ చెప్పాలని అడుగుతున్నారు. క్రిస్టియన్ మతాన్ని రోడ్డుకు ఈడ్చినది ఎవరు..? పదవి కోసం మతాన్ని రోడ్డుకు ఈడ్చింది ఎవరు..? బలవంతపు మతమార్పిళ్లు బైబిల్ లో ఉందా..? దీనికి సమాధానం చెప్పాలి. ప్రజాజీవితంలో కొన్ని పద్ధతులు ఉంటాయి. ఇష్టారాజ్యంగా చేయడం కరెక్ట్ కాదు.