ఏపీని విభజించి ఆంధ్ర, తెలంగాణలో కాంగ్రెస్ కుదేలైపోతే… మాట ఇచ్చి తప్పిన బీజేపీపై ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్నారు… ప్రత్యేక హోదా, అభివృద్ధి చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ ఇవేమీ పట్టించుకోకుండా, రాష్ట్రాన్ని మరింత నాశనం చేసే ప్లాన్ వేసింది... ఉన్న రాష్ట్రానికి ఏమి చెయ్యకుండా, రాయలసీమ డిక్లేరషన్ అంటూ చిచ్చు రేపింది... దీని పై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు... శనివారం, వైజాగ్ వెళ్ళే ముందు టీడీపీ ముఖ్యనేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు... నేను సీమ బిడ్డనే, రాయలసీమకు అన్యాయం చేయ్యనిస్తాను అంటూ, బీజేపీకి ఇప్పుడు గుర్తొచ్చిందా రాయలసీమ అంటూ నిప్పులు చెరిగారు ...
ఏపీ ప్రయోజనాలే ప్రధాన అజెండాగా పని చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతలను ఆదేశించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ బీజేపీ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయొద్దని సూచించారు. ఏపీని ప్రత్యేకంగా చూస్తానన్న కేంద్రం తన మాటను నిలబెట్టుకోలేకపోవడం వల్లే పోరాటం చేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే బీజేపీ కర్నూలు డిక్లరేషన్ అంశంపైనా చంద్రబాబు స్పందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాయలసీమను అభివృద్ధి చేశామన్నారు. తానూ రాయలసీమ బిడ్డనేనని విమర్శించేవారు గుర్తించుకోవాలని ఆయన అన్నారు.
కనీవినీ ఎరుగనిరీతిలో రాయలసీమకు నీళ్లందించామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. రాయలసీమ పేరుతో బీజేపీ నాటకాలాడుతోందని మండిపడ్డారు. బీజేపీ నేతలకు రాయలసీమ ఇప్పుడు గుర్తొచ్చిందా అని నిలదీశారు. కర్నూలులో సుప్రీంకోర్ట్ బెంచ్, అమరావతిలో దేశ రెండో రాజధాని ఏర్పాటు చేస్తే బీజేపీ చిత్తశుద్ధి ఏంటో అర్థమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విభజన హామీల అమలు విషయంలో కేంద్రంపై ఒత్తిడి, నేతలు అనుసరించాల్సిన వైఖరిపై సమావేశంలో నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.