అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం లేనప్పటికీ , ఈ విషయమై స్పష్టత వున్నప్పటికీ ఉత్తర్వులు రాబ ట్టడంలో నిర్లిప్తత వహిస్తే ఎలా అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు న్యాయశాఖ అధికారులపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం వెలగపూడి సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టు నుంచి స్పష్టత వచ్చేలా ఎందుకు వాదనలు వినిపించడం లేదని ప్రశ్నించారు. అధికారుల వల్ల కాకుంటే ఢిల్లి నుంచి మంచి లాయర్లను నియమించుకోవాలన్నారు. అదీ కాకపోతే తానే కోర్టుకెళ్ళి వాదనలు వినిపిస్తానని ప్రకటించారని తెలిసింది. బాబ్లి ప్రాజెక్టు ఉద్యమం సమయంలో మహారాష్ట్ర కోర్టులో తామే వాదనులు వినిపించిన విషయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

cbn 01062018 2

రానున్నది ప్రభుత్వానికి కీలక సమయమని, చేసిన పనులపై ప్రజలలో విస్తృత ప్రచారం క ల్పించాల్సి వుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలలో వున్న సంతృప్తి శాతాన్ని పెంచే క్రమంలో మంత్రులంతా బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగానే వచ్చే సాధారణ ఎన్నికలు అత్యంత కీలకం అని పేర్కొన్న ముఖ్యమంత్రి మంత్రుల కు దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. శాఖ లపరంగా మంత్రులు సరిగా పనిచేయడం లేదంటూ సి.ఎం. మండిపడ్డారని తెలిసింది. తిడితే ఇమేజి దెబ్బ తింటుందనే కారణంతో హెచ్చరించడం లేదని పేర్కొన్నారు. అగ్రిగోల్డ్‌ ఆస్తులను వేలం వేసే బాధ్యతను కోర్టు తీసుకుంటుందా లేదా ప్రభుత్వం తీసుకోవాలా అనే అంశాలపై త్వరగా తేల్చాలంటూ న్యాయశాఖను ఆదేశించారు.

cbn 01062018 3

తాము చిత్తశుద్దితో పనిచేస్తున్నా అధికారులు ఆ మేరకు పనిచేయడం లేదంటూ మండిపడ్డారు. విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మంత్రివర్గ భేటీలో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు తెలిసింది. త్వరలోనే కోర్టు అనుమతితో ఈ సమస్యకు ఒక ముగింపు పలకాలని చంద్రబాబు పేర్కొంటూ తాజా గా గుంటూరులో ప్రజలు, అగ్రిగోల్డ్‌ బాధితులు చేస్తున్న ఆందొళనను ప్రస్తావించారు. కోర్టు అనుమతితో త దుపరి చర్యలకు దిగాలని అధికార యంత్రాంగానికి ఆదేశాలిచ్చారని తెలిసింది. హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలుకు ఎలాంటి అభ్యంతరం లేదన్న ముఖ్యమంత్రి ఇందుకు సంబంధించి మరో నివేదికను ఇవ్వాలంటూ కోరారు.అగ్రిగోల్డ్‌ సమస్యపరిష్కారానికి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకోసం 200 నుంచి 250 కోట్ల రూపాయలను కార్పస్‌ ఫండ్‌గా పెట్టాలనే నిర్ణయాన్ని కేబినెట్‌ తీసుకుంది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read