గత నెల రోజులుగా వైసీపీ చేస్తున్న దాడులలో చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇవ్వటానికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ రోజు నుంచి జిల్లాల పర్యటన మొదలు పెట్టారు. ముందుగా, ఈ రోజు, ప్రకాశం జిల్లా చినగంజాం మండలం రుద్రమాంబపురంలోని తెలుగుదేశం కార్యకర్త పద్మ కుటుంబాన్ని పరామర్శించారు. వైసీపీ దాడిలో, ఆమెను రోడ్డు మీద వివస్త్రను చేయడంతో మనస్తాపానికి గురై, ఆమె ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఈ రోజు చంద్రబాబు ఆమె కుటుంబ సభ్యలను పరామర్శించి, 7.65 లక్షల రూపాయల ఆర్ధిక సాయం, పార్టీ వైపు నుంచి అందించారు. కుటుంబ నేపధ్యం అడిగి తెలుసుకున్నారు. మృతి చెందిన పద్మ పిల్లల్ని, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ ద్వారా చదివిస్తామని హామీ ఇచ్చారు. కుటుంబానికి అండగా ఉంటానని, ఏ సహాయం కావాలన్నా, తన వద్దకు వస్తే అన్నీ చూసుకుంటానని చంద్రబాబు అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, అక్కడ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

ఓక్ మహిళ అని కూడా చూడకుండా, రోడ్డు పైకి ఈడ్చుకొచ్చి, తన్నారని, చివరకు ఆమె చావుకు కారణం అయ్యారని మండిపడ్డారు. ఆమెను నడి రోడ్డు పై వివస్త్రను చేసి సెల్‌ఫోన్‌లో వీడియో తీసుకున్నారని, ఇలాంటి పనులు దారుణమని అన్నారు. నాగరిక సమాజంలో బ్రతుకుతూ, ఒక ఒక ఆడబిడ్డ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తిస్తారా అని ధ్వజమెత్తారు. ఇంత పెద్ద ఘటన జరిగితే, జగన్ మాట్లాడడు, హోంమంత్రి ఇలాంటివి అన్నీ మామూలే, అందరికీ కాపలా ఉన్దేలం అంటున్నారు అని అన్నారు. కళ్ల ముందే దోషులు తిరుగుతున్నా, వారిని ఏమి చెయ్యలేని ఈ ప్రభుత్వం ఎందుకని అన్నారు. రాష్ట్రాన్ని మరో పులివెందుల చేద్దామనుకుంటున్నారా ? అని ప్రశ్నించారు. ఈ దాడిలో పద్మ భర్తకు కూడా తీవ్ర గాయాలయ్యాయని చంద్రబాబు అన్నారు. మనవాళ్లను కొట్టి తిరిగి మనవాళ్లపైనే కేసులు పెడతున్నారని, ఇలా అయితే ప్రజలు తిరగబడతారని అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read