గత రెండు రోజులుగా, కెసిఆర్ మూడోఫ్రంట్‌ అంటూ హడావిడి చేస్తున్న సంగతి తెలిసిందే... బీజేపీ, కాంగ్రెస్ విఫలం అయ్యాయని, దేశంలో కొత్త రాజకీయ శక్తికి నేను పురుడు పోస్తానని, నాకు వాళ్ళు ఫోన్ చేసారు, వీళ్ళు ఫోన్ చేసారు అంటూ, హడావిడి చేస్తున్నారు... దీనికి పవన్ కళ్యాణ్ కూడా, కెసిఆర్ కు మద్దతు అంటూ ప్రకటించారు... ఈ నేపధ్యంలో, నిన్న కొంత మంది టిడిపి నేతలు చంద్రబాబుని కలిసినప్పుడు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది... మనం కూడా, ఈ విషయంలో ముందుకు వెళ్ళాలని, కెసిఆర్ మిమ్మల్ని హైజాక్ చేసి, తాను పెద్ద నేతగా చుపించుకోవాలని చూస్తున్నారని కొంత మంది టిడిపి నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావించగా, ఆయన స్పందించారు...

cbn 05032018 2

కేంద్రం నుంచి రాష్ట్రానికి సాధించుకోవలసిన ప్రయోజనాలకే మన ప్రథమ ప్రాధాన్యం, రాజకీయం చేసే పరిస్తుతుల్లో మన రాష్ట్రము లేదు, నేను లేను... అవి ఎన్నికలప్పుడు చూసుకుందాం... ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది... ఇప్పటి నుంచే, పరిపాలన ఆపేసి, రాజకీయం చేసే పనిలో నేను ఉండలేను... టీఆర్‌ఎస్‌ ఏ కూటమిలోనూ లేదు. తెలంగాణ రాష్ట్రం వడ్డించిన విస్తరి... ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉంది. మనది దానికి భిన్నమైన పరిస్థితి... ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్లో ఉన్న కొత్త రాష్ట్రానికి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవలసిన పరిస్థితి... అవకాశం ఉన్నంతవరకూ దానికోసం ప్రయత్నిస్తున్నాం... ఇప్పుడు బంతి బీజేపీ కోర్టులో ఉంది.. వారి పై సాధ్యమైనంత ఒత్తిడి తీసుకువచ్చి, రాష్ట్రానికి లాభం చేకురలనేది ప్రయత్నం... దాని కోసమే ఈ ఆందోళనలు.. ఈ సమావేశాల్లో వారు స్పందించకుంటే, మన నిర్ణయం రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకునే ఉంటుంది అని చంద్రబాబు అన్నారు...

cbn 05032018 3

ఈ సమయంలో బీజేపీపై విరుచుకుపడి.. బయటకు రావడం వల్ల టీడీపీకి రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది... ఇరవై రెండేళ్ల కిందే యునైటెడ్‌ ఫ్రంట్‌కు జాతీయ కన్వీనర్‌గా దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన నాకు, ఇప్పుడు ఇంత అనుభవం వచ్చిన తరువాత, ఇలాంటివి చెయ్యటం పెద్ద సమస్య కాదు... సరైన సమయంలో రాష్ట్రానికి లాభం చేకూరేలాగే మన రాజకీయ అడుగులు ఉంటాయి అని స్పష్టం చేసారు... అప్పుడు ఒక సీనియర్ నేత కల్పించుకుని... కెసిఆర్ ని, జాతీయ నేతలు నమ్మే స్థితి ఉండదు అని అన్నారు.. ఒకసారి సోనియా దేవత అన్నారు, మరో సారి దెయ్యం అంటారు.. ఒకసారి మోడీ లాంటి నేత దేశానికి అవసరం అంటారు, ఇప్పుడు మోడీ లాంటి వాడు దేశానికీ అవసరం లేదు అంటారు... ఇలా కెసిఆర్ కావలసినప్పుడు మాట మార్చేస్తారని, ఇలాంటి వైఖరితో కెసిఆర్ లీడ్ చేసే అవకాసం ఉండదు అని గుర్తు చేస్తున్నారు... చంద్రబాబు మాత్రం, ముందు రాష్ట్ర ప్రయోజనాలు అని, తరువాతే రాజకీయం అని తేల్చి చెప్పారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read