నూతన సంవత్సరం తొలి రోజు సీఎం రిలీఫ్ ఫండ్ ఫైలు పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి సంతకం చేసారు. వైద్య చికిత్సల సాయం కోసం వచ్చిన రీఇంబర్స్‌మెంట్ దరఖాస్తులు 7,386. రీఇంబర్స్‌మెంట్ ఇస్తున్న కేసుల సంఖ్య 6,207. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి విడుదల చేసిన రీ ఇంబర్స్‌మెంట్ సొమ్ము మొత్తం రూ.34,50,59,383. ఎల్ ఓ సీలకు వచ్చిన దరఖాస్తులు 1179, విడుదల చేసిన సొమ్ము మొత్తం రూ. 19, 13, 41,055. రీఇంబర్స్ మెంట్, ఎల్.ఓ.సీలు కలపి విడుదల చేసిన సొమ్ము మొత్తం 53,64,00,438. 2014 నుంచి నేటిదాకా సీఎం ఆర్ ఎఫ్ నుంచి విడుదల చేసిన సొమ్ము మొత్తం రూ.1249.56 కోట్లు.
మరో వైపు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొలువుదీరింది. హైకోర్టు తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ బాధ్యతలు స్వీకరించారు. విజయవాడలో గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణ హాజరయ్యారు. ప్రధాన న్యాయమూర్తితోపాటు మిగిలిన న్యాయమూర్తులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేయించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పూర్తి స్థాయిలో కార్యకలాపాలకు శ్రీకారం చుట్టినట్లయింది.
ఏపీ విభజన నేపథ్యంలో 62ఏళ్ల తర్వాత సోమవారం అమరావతికి హైకోర్టు తరలివెళ్లింది. దీంతో రాష్ట్రంలో చారిత్రక ఘటం ఆవిష్కృతమైంది. 2018 డిసెంబరు 26న ఉమ్మడిహైకోర్టు విభజన నోటిఫికేషన్ వెలువడింది. దీంతో నేటి నుంచి అమరావతి కేంద్రంగా ఏపీ రాష్ట్ర హైకోర్టు విధులు ప్రారంభమయ్యాయి. ఉమ్మడిహైకోర్టులో 3.4లక్షల వ్యాజ్యాలు ఉండగా.. అందులో 70శాతం వరకు కేసులు ఏపీకి చెందినవే. ఏపీ హైకోర్టుకు మంజూరైన న్యాయమూర్తుల పోస్టులు 37 కాగా... ప్రస్తుతం ఉన్న వారు 14 మంది.