తెలుగుదేశం పార్టీ తరుపున వివిధ చర్చల్లో కాని, టీవీల ముందు కాని మాట్లాడే వారు చాలా వీక్ గా మాట్లాడతారు అనే అభిప్రాయం ఉంది. ఇక నేషనల్ మీడియాలో అయితే, చెప్పనే అవసరం లేదు. అలాంటిది, నిన్న జయదేవ్ ఇంగ్లీష్ లో, రామ్మోహన్ హిందీలో వాయించిన తీరు చూసి, దేశం మొత్తం ఆశ్చర్యపోయింది. నిన్న ఢిల్లీ వెళ్ళిన చంద్రబాబుకు అనేక మంది చెప్పిన విషయం ఇదే. ఇన్నాళ్ళు వీళ్ళను ఎక్కడ దాచారు చంద్రబాబు, వీళ్ళను నేషనల్ స్పోక్స్ పర్సన్స్ చెయ్యండి అంటూ, ఢిల్లీలో నేతలు, సీనియర్ జర్నల్సిస్ట్ లు అంటూ కనిపించారు. ఢిల్లీలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ గల్లీల్లో కూడా, ఇదే అభిప్రాయం కనిపించింది. పార్టీలకు అతీతంగా అందరూ, వీరిద్దరినీ మెచ్చుకున్నారు.

cbn 22072018 2

వీళ్లిద్దరూ రాజకీయ కుటుంబాల నుంచే వచ్చారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా శుక్రవారం ఒకరు ఇంగ్లీషులో, మరొకరు హిందీలో రాష్ట్ర వాదనలను సమర్థంగా వినిపించారు. గల్లా జయదేవ్‌ బాల్యం, చదువు మొత్తం అమెరికాలోనే సాగింది. దీంతో ఆయనకు ఆంగ్లంపై మంచి పట్టుంది. అమెరికా యాస కలిసిన ఆయన ఇంగ్లిషు, వాడే పదజాలం, ఉచ్ఛారణ సూటిగా ఘాటుగా ఉంటా యి. బడ్జెట్‌ సమావేశాల సమయంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై తక్కువ సమయంలోనే ఆయన చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. గల్లాలోని ‘స్పీకర్‌’ తొలిసారి అందరికీ పరిచయమైంది అప్పుడే. ‘మిస్టర్‌ ప్రైమ్‌ మినిస్టర్‌’ అంటూ సూటిగా నిలదీసిన తొలి నాయకుడు కూడా ఆయనే. నిజానికి ‘మిస్టర్‌’ అనేది ఒక గౌరవ వాచకం. అమెరికాలో ‘మిస్టర్‌ ప్రెసిడెంట్‌’ అని సంబోధిస్తారు.

cbn 22072018 3

రామ్మోహన్‌నాయుడు మాట్లాడిన 12 నిమిషాలు సభ మొత్తం ఆయనపైనే దృష్టి కేంద్రీకరించింది. ‘మనోడికి హిందీ ఇంత బాగా ఎలా వచ్చింది?’ అనే ప్రశ్నలు చాలామందిలో తలెత్తాయి. అసలు విషయమేమిటంటే... రామ్మోహన్‌ నాయుడు పాఠశాల చదువు ఢిల్లీలో సాగింది. అక్కడ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఆయన చదువుకున్నారు. దీంతో ‘ఢిల్లీ లోకల్‌ ఫ్లేవర్‌’ ఉన్న హిందీ బాగా అబ్బింది. ‘మీ ప్రసంగాన్ని మీరు పూర్తి చేయండి’ అని స్పీకర్‌ సూచించగా... ‘ఓకే మేడమ్‌’ అనేలా ‘చలీయే మేడమ్‌’ అంటూ ప్రసంగాన్ని కొనసాగించడం విశేషం.

Advertisements

Advertisements

Latest Articles

Most Read