ముఖ్యమంత్రి చంద్రబాబు అమెరికాలోని అయోవా నగరంలో జరిగిన వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సదస్సుకు హాజరయ్యారు. మన దేశం నుంచి హాజరయిన ఏకైక ప్రతినిధి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ముఖ్యమంత్రికి అక్కడ అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబుని సదస్సుకి ఇంట్రాడ్యుస్ చేస్తూ, "చంద్రబాబు గారు మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడ దాకా వచ్చారు... ఇక్కడ ఉన్న గెస్ట్స్ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఇవాళ వారి దేశంలో దీపావళి పండుగ, అక్కడ పండుగ జరుపుకోకుండా ఇక్కడ దాకా వచ్చారు... చంద్రబాబు గారు మీరు వచ్చినందుకు ధన్యవాదాలు అంటూ" ఆ ప్రతినిధి అన్నారు.
అయోవా యూనివర్సిటీ నిర్వహిస్తున్న వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సదస్సులో ముఖ్య వక్తగా చంద్రబాబు పాల్గున్నారు. నదులు అనుసంధానం, ఇరిగేషన్ ప్రాజెక్ట్లు, వ్యవసాయంలో ఆధునికత, ఇలా అన్ని విషయాల పై చంద్రబాబు ప్రసంగించారు. వ్యవసాయరంగానికి సంబంధించి వివిధ ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయోవా యూనివర్సిటీకి కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.
1987 నుంచి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ప్రముఖులకు అవార్డులను అందజేస్తున్నది. వ్యవసాయరంగంలో, ఆహార పంపిణీలో ప్రతిభ కనబరిచిన వారికి ఈ అవార్డులను ఫౌండేషన్ అందజేస్తోంది. అయోవా విశ్వవిద్యాలయ ప్రతినిధి దిలీప్‌కుమార్ స్వయంగా మే నెలలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వానపత్రాన్ని అందజేశారు. ఈ సదస్సులో పాల్గొనేందుకు అప్పుడే ముఖ్యమంత్రి అంగీకారాన్ని తెలియజేశారు.