మంగళవారం కియా ప్రతినిధులతో సచివాల యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అభివృద్ధిలో తన వేగాన్ని కియా ప్రతినిధులు అందుకున్నారని, అం దుకు తనకెంతో సంతోషంగా ఉందని చెప్పారు. జనవరి మొదటి తేదీ నాటికి తొలి ఇండియా మేడ్‌ కారు ఏపీ రోడ్లపై తిరగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కియా ప్రతినిధులకు దిశానిర్ధేశం చేశారు. కొత్త ఏడాది కొత్త రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన రోడ్లపై కొత్త కారు తిరగాలనేది తన అభిలాష అని చెప్పారు. తన అభి లాషకనుగుణంగా కియా కంపెనీ ప్రతినిధులు నిర్మాణాన్ని వేగవంతం చేయాల న్నారు. విభజన అనంతరం అతిపెద్ద మోటారు కంపెనీ అమరావతిలో తమ కంపెనీ ఏర్పాటుకు ముందుకు రావడం శుభసూచకంగా భావించి తమ ప్రభుత్వం అవ సరమైన అనుమతులను యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేసిందన్నారు.

kia 13062018 2

తమ శ్రద్దను గుర్తించిన కియా మోటార్సు కూడా అంతే వేగంతో తమ కంపెనీ నిర్మాణ పనులను చేెస్తోందని చెప్పారు. ఇదే వేగం అమరావతిలో నిర్మితమయ్యే అన్ని కంపె నీల యాజమాన్యాల్లోనూ రావాలని అభిలాషించారు. అప్పుడే తాను అనుకున్న అమరావతిని త్వరితగతిన భావితరాలకు చూపించే అవకాశముందన్నారు. ఈ కంపెనీల ఏర్పాటు ఎంత త్వరగా పూర్తయితే ఇక్కడి నిరుద్యోగులకు, పట్టభధ్రులకు అంతే త్వరగా ఉద్యోగాలు కల్పించే వీలవుతుందని తెలిపారు. అంతేకాకుండా పరో క్షంగా ఈ కంపెనీపై ఆధారపడి ఉపాధి పొందే వారి సంఖ్య లక్షల్లో ఉండే అవకాశ ముందన్నారు. ఇటువంటి ఉపాధి కల్పతరువులాంటి అనేక కంపెనీలు రాష్ట్ర ప్రభు త్వ సంకల్పాన్ని, లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని తమ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి తమ ప్రభుత్వ ఆశయాలను నెరవేర్చాలని కోరారు.

kia 13062018 3

ముఖ్యంగా నిరుద్యోగ యువతకు వీలైనంత త్వరగా ఉపాధి అవకాశాలు కల్పిస్తే రాష్ట్ర ఆదాయం పెరగ డంతోపాటు సగటు మానవుడి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. ఈ సందర్భంగా కియా మోటార్స్‌ ప్లాంటు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు సంతృప్తిని వ్యక్తం చేశారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధిపై వీడియో చిత్ర ప్రదర్శనను తిలకించారు. అనంతపురం జిల్లాలోని యువతకు ఆటోమొబైల్‌ విభాగంలో నైపుణ్యం కల్పించేందుకు కియా, ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ కలిసి ఈనెల 20 నుంచి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుందని ముఖ్యమంత్రి అన్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read