ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు గురించి తెలియని వారు ఉండరు... అయితే ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా పని చేసిన రోజులే కాని, ఆయన జీవిత చరిత్ర గురించి పెద్దగా ఎవరికీ తెలియదు... ఇప్పుడు చంద్రబాబు పై మొదటి సారిగా, ఆయన బయోగ్రఫీ పుస్తక రూపంలో రానుంది... చంద్రబాబు "గ్లోకల్ లీడర్" అంటూ యూకే కి చెందిన బ్లూమ్స్ బెర్రీ ప్రత్యెక పుస్తకం ప్రచురిస్తుంది... హైదరాబాద్ కు చెందినా తేజస్వినీ పగడాల అనే యువ రచియత, ఈ పుస్తకం రాశారు..
లోకల్‌గా ఏపీని అభివృద్ధి చేయడం... గ్లోబల్‌గా రాష్ట్రాన్ని ప్రత్యేక స్థానంలో నిలపడం! ఈ రెండూ కలిసి... ‘గ్లోకల్’ నాయకుడుగా చంద్రబాబు ఎదిగారంటూ బ్రిటీష్ ప్రచురణ సంస్థ బ్లూమ్స్ బెర్రీ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ‘చంద్రబాబు నాయుడు - ఇండియాస్ గ్లోకల్ లీడర్’ అనే ఈ పుస్తకాన్ని చంద్రబాబు చేతే ఆవిష్కరింపచేయాలని భావించారు. కానీ, సమయం కుదరకపోవడంతో వాయిదా వేస్తూ వచ్చారు. చివరికి... ఈ పుస్తకాన్ని పాఠకులకు, చంద్రబాబు అభిమానులకు అందించాలన్న ఉద్దేశ్యంతో మార్కెట్‌లోకి ప్రవేశపెట్టారు. గ్లోబల్, లోకల్ అనే రెండు పదాలను కలిపి...‘గ్లోకల్’ అనే కొత్త పదాన్ని ఉపయోగించారు.
తేజస్వినీ పగడాల, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కొన్నాళ్ళు పని చేసారు... ఆ సమయంలో చంద్రబాబు పని తీరుని దగ్గరుండి చూసారు... చంద్రబాబు ఎంత విజనరీనో ఆమె స్వయంగా చూసారు... ఆంధ్రప్రదేశ్ నిర్మాణం కోసం, ఆయన ఎంత కష్టపడుతుంది, ఆయన ముందు చూపు, టెక్నాలజీ వినియోగం, ఇవన్నీ చూసారు... చంద్రబాబు గురించి చాలా విషయాలు బయటకు తెలియవు అని, ఆయన గురించి మనకు తెలిసింది చాలా తక్కువ అని, ఆయన పట్టుదల, పనితనం గురించి ఇప్పటి యువతకు తెలియాల్సిన అవసరం ఉంది అని, అంతే కాకుండా దేశం మొత్తం కూడా చంద్రబాబు చేసిన పనులు తెలియాలి అని, అందుకే ఈ పుస్తకం రాసినట్టు చెప్పారు...