ఆయన ఒక సీనియర్ ఐఏఎస్.. దేశంలో ఎంతో మందిని చూసారు.. కాని ఈ రోజు చంద్రబాబు చూపిస్తున్న చొరవ చూసి శభాష్ అంటున్నారు.. సహజంగా ఒక తుపాన్ ,వరద వచ్చినప్పుడు ప్రకటించే ప్రభుత్వ నష్ట పరిహారం మళ్ళీ తుఫాన్ వచ్చే దాకా అతిగతి ఉండదు, అదికూడా అరకొరగా ఉంటుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తిత్లీ తూఫాన్ బాధితులకు మాట ఇచ్చిన ప్రకారం 447.27 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించనుంది. నష్టపోయిన రైతులకు ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటించి చెక్కులు ఇవ్వనున్నారు. ఇంత తక్కువ సమయంలో ఇలా నష్టపోయిన రైతులను భారత దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఎన్ని కష్టాలు ఉన్నా, లోటు బడ్జెట్ ఉన్నా, ప్రభుత్వం ఈ రోజు 447.27 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లిస్తుంది.
ఇన్ని ఏళ్ళు ప్రభుత్వాలు నష్టపరిహారం ఇస్తాం అని చెప్పటం, ఇవ్వకుండా మొహం చాటేయటం చూసాం. మా ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన మాట మీద నిలబడే ప్రభుత్వం అని నిరూపించింది. కేంద్ర ప్రభుత్వం ఇంత పెద్ద విపత్తు సంభవిస్తే, కనీసం సహాయం చేయలేదు. కేంద్రం ఏ సహాయం చేయకున్నా, ప్రతిపక్ష పార్టీలు పల్లెత్తు మాట కూడా అనలేని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని ముఖ్యమంత్రి గారు, ఈ పరిహారం వెంటనే చెల్లించే ఏర్పాటు చేయటం చాలా ఉపయోగకరమైన, ఆనందకరమైన ప్రయత్నం. 447.27 కోట్ల రూపాయల చెక్కులు ఈ రోజు ముఖ్యమంత్రి గారు నష్టపోయిన రైతులకు పంపిణీ చేయనున్నారు. కేవలం 20 రోజుల్లోనే నష్టాలను అంచనా వేసి.. బాధితుల జాబితాలు రూపొందించి వారి ఖాతాల్లో సొమ్ములు జమ చేయడం దేశంలోనే ఒక రికార్డుగా ప్రభుత్వం భావిస్తోంది.
తుపాను కారణంగా జిల్లాలో 25 మండలాల పరిధిలోని 717 గ్రామాల్లో ప్రజలు నష్టపోయారు. ఇంత వరకు 4.30లక్షల మంది బాధితులు లెక్కతేలారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖచిత్రంతో గుంటూరులో నమూనా చెక్కులు తయారు చేస్తున్నారు. సోమవారం ఉదయం వరకు గ్రామాలకు చేర్చి.. పంపిణీ ప్రారంభిస్తారు. బాధితులకు ఇచ్చేవి నమూనా చెక్కులు మాత్రమే.. నగదు మాత్రం నేరుగా ఖాతాల్లో జమవుతుంది. శనివారం రాత్రే సొమ్ములు సర్దుబాటు చేయాల్సిందిగా ట్రెజరీ నుంచి ముంబయిలోని రిజర్వు బ్యాంకును కోరారు. సోమవారం ఉదయం ఆర్బీఐ నుంచి క్లియరెన్సు వస్తుందని భావిస్తున్నారు. మధ్యాహ్నానికల్లా జమ చేయాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు తేలిన అంచనాల మేరకు తొలిదశల్లో రూ.480 కోట్ల నుంచి రూ.490కోట్ల వరకు పంపిణీ చేయాల్సి ఉంటుందని, తమ పేర్లు లేవని ఫిర్యాదులు వస్తుండటంతో.. వీటిని పరిశీలించి మరో మిగతా మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.