ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో సారి ఢిల్లీ వెళ్ళనున్నారు... మరో సారి ప్రధాని మోడీతో భేటీ కానున్నారు... ఈ నెల 12న చంద్రబాబు, ప్రధాని మోడీని కలసిన విషయం తెలిసిందే... దాదాపు సంవత్సరం తరువాత ఆ భేటీ జరిగింది... ఆ భేటీలో చంద్రబాబు రాష్ట్రానికి రావలసిన అన్ని విషయాల పై మాట్లాడారు... సమగ్ర నివేదికలు కూడా ఇచ్చారు... చంద్రబాబు, మోడీ భేటీ గురించి ప్రజలు చాలా ఆశక్తిగా ఎదురు చూసారు... ప్రధాని అన్ని విషయాల పై చోరావ తీసుకుని, సమస్యలు పరిష్కరిస్తాను అని చెప్పినట్టు చంద్రబాబు చెప్పారు... రొటీన్ సమాధానమే అయినా, ఢిల్లీలో పరిణామాలు గురించి తెలిసినవారు మాత్రం, సమావేశం సీరియస్ గా జరిగినట్టు, సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశాభావంతోనే ఉన్నారు....
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 17న మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో 17న జరగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు- 2018 సన్నాహక సమావేశంలో సీఎం పాల్గొంటారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారని తెలుస్తోంది.
కాగా సమావేశం అనంతరం ఆర్థిక మంత్రి, జలవనరుల శాఖ మంత్రి, హోం శాఖ మంత్రితో భేటీ అయ్యి విభజన హామీల విషయమై నిశితంగా చర్చించనున్నారు. ముఖ్యంగా పోలవరం, ఆంధ్రప్రదేశ్ కి రావాల్సిన నిధుల విషయమై ప్రధాని మోదీతో కూడా చంద్రబాబు సమావేశమవుతారని విశ్వసనీయ వర్గాల సమాచారం.