సంక్రాంతికి ముందు రోజే ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుడ్ న్యూస్ వినబోతున్నారా ? స్పష్టమైన హామీ వస్తుందా ? లేకపోతే ఎప్పటిలాగే, చేస్తాం, చూస్తాం అనే మాటలనే ? ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలా పావులు కదుపుతారు ?ఇవన్నీ ఏంటి అనుకుంటున్నారా ? దాదాపు సంవత్సరం తరువాత దాదాపు సంవత్సరం తరువాత, ప్రధాని మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో రేపు భేటీ కానున్నారు... ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్నారు... రేపు 10.40 గంటలకు ప్రధాని మోదీతో భేటీ కానున్నారు చంద్రబాబు...
ముందుగా 12వ తారీఖునే అపాయింట్‌మెంట్ ఖరారైనా, పండగ నేపధ్యంలో మళ్ళీ 17వ తేదీకి వాయిదా పడినట్లు వార్తలు వచ్చాయి... అయితే ఇవాళ ప్రధాన మంత్రి ఆఫీస్ నుంచి, ముఖ్యమంత్రిని రమ్మని కబురు రావటంతో, చంద్రబాబు ఇవాళ సాయంత్రమే బలయుదేరి వెళ్తున్నారు... రేపు జన్మభూమి కార్యక్రమం చివరి రోజు అయినా, ఈ మీటింగ్ ముఖ్యం కాబట్టి, ఉదయం ప్రధానిని కలిసి, సాయంత్రానికి తిరిగి వచ్చి, జన్మభూమి ముగింపు సభలో పాల్గునే అవకాసం ఉంది... ఈ సందర్బంగా ముఖ్యమంత్రి భారీ అజెండాతో ప్రధానిని కలవబోతున్నారు... స్పెషల్ ప్యాకీజి, రైల్వే జోన్, నియోజకవర్గాల పునర్విభజన, రెవెన్యూ లోటు, పోలవరంపై సీఎంల సమావేశం, విభజన చట్టంలోని అంశాల పై వీరిద్దరి మధ్య చర్చ జరిగే అవకాశముందని సమాచారం.
ఇప్పటికే ప్రధానికి వివరించే అంశాలపై సమగ్ర నివేదిక రెడీ అయ్యింది... ఈ భేటీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది... దాదాపు తెలుగుదేశం, బీజేపీ మైత్రి అయిపొయింది అనుకున్న సమయంలో, గత వారం రోజులు నుంచి రాష్ట్రానికి కేంద్రం అన్నీ మంచి విషయాలు చెప్తుంది.. రాష్ట్రం మీద ప్రేమ కానివ్వండి, రాజకీయ అవసరం కానివ్వండి, ఎట్టకేలకు ఢిల్లీ మన సమస్యల పై స్పందిస్తుంది... చంద్రబాబు కూడా సంవత్సరం నుంచి మోడీ పిలవక పోయినా, రాష్ట్రం కోసం ఎన్నో అవమానాలు భరించారు... బయటకు వచ్చేసి, ఇక్కడ ప్రజలను రెచ్చగొట్టి, ఆత్మ గౌరవ నినాదం అనో, ఇంకోటో అనో, హాయిగా రాజకీయంగా పబ్బం గడుపుకోవచ్చు... కాని ఈయన అందరి లాంటి రాజకీయ నాయకుడు కాదు... ముందు నవ్యాంధ్ర నిర్మాణం ముఖ్యం.. పోలవరం ముఖ్యం, అమరావతి ముఖ్యం... ఇవి సాకారం అవ్వాలి అంటే కేంద్రం సహకరించాల్సిందే... లేకపోతే పర్మిషన్ లు ఉండవు, నిధులు ఉండవు, రాష్ట్రంలో అశాంతి వాతావరణం... ఇవన్నీ బేరీజు వేసుకుని, చంద్రబాబు ఓర్పుగా, ప్రజల సహకారంతో, ఢిల్లీ పెద్దల ముందు ఆత్మగౌరవంతో నిలబడ్డారు... ఢిల్లీ పెద్దలు ఇప్పటికైనా, మన ఆకాంక్షను, చంద్రబాబు కష్టాన్ని గుర్తించి, సహకరించాలి అని కోరుకుందాం..