ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ యువతకు శుభవార్త. ఆయా శాఖల్లో ఖాళీగా ఉన్న 20 వేలకు పైగా పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆమోదం తెలిపారు. ఈ ఉదయం అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో చంద్రబాబు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏయే శాఖల్లో ఖాళీలు ఉన్నాయనేదానిపై ఆధికారులతో సమీక్షించారు. 20,010 ఖాళీల భర్తీకి ఈ సమావేశంలో సీఎం ఆమోదం తెలిపారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఈ నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ నియామకాల ప్రక్రియను త్వరిత గతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అసెంబ్లీలో దీనిపై సీఎం ప్రకటన చేసే అవకాశం ఉంది.
గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, డీఎస్సీ, పోలీస్ శాఖలతో సహా వివిధ శాఖల్లోని 20,010 ఖాళీల భర్తీ... ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్ధతిలో ఖాళీల నియామకం.. వివిధ శాఖలలో ప్రస్తుతం వున్న ఖాళీలు, అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రీన్‌సిగ్నల్ మొత్తం నియామకాల వివరాలు : గ్రూప్-1 ఖాళీలు 150, గ్రూప్-2 ఖాళీలు 250, గ్రూప్-3 ఖాళీలు 1,670, డీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఖాళీలు 9,275, పోలీస్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్ఎల్‌పీఆర్‌బీ ఖాళీలు 3,000, వైద్య శాఖలో ఖాళీలు 1,604
ఇతర ఖాళీలు 1,636, పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు 310, జూనియర్ లెక్చరర్ (ఇంటర్మీడియేట్) పోస్టులు 200, ఏపీఆర్ఈఐ సొసైటీ పోస్టులు 10, ఏపీఆర్ఈఐ సొసైటీ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు 5, డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు 200, సమాచార పౌర సంబంధాల శాఖలో 21 ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుమతి, డీపీఆర్‌వో పోస్టులు 4, ఏపీఆర్‌వో పోస్టులు 12, డీఈటీఈ పోస్టులు 5..