ప్రతి సారి గవర్నర్ విజయవాడ రావటం, చంద్రబాబుని కలిసి, ఢిల్లీ నుంచి వచ్చిన సందేశం చెప్పటం.. ఇది ఎప్పుడూ జరిగే సీన్.. కాని ఈ సారి ఇక్కడ ఉంది దెబ్బ తిన్న ఆంద్రుల ప్రతినిధి. ఇప్పుడు సీన్ మారింది, డైలాగ్ మారింది. ఎప్పుడు మీరు నాకు ఢిల్లీ నుంచి సందేశం ఇచ్చే వారు, ఈ సారి నా సందేశం ఢిల్లీకి చెప్పండి అంటూ, చంద్రబాబు గవర్నర్ తో తేల్చి చెప్పారు. మంత్రవర్గ విస్తరణలో భాగంగా మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించేందుకు గవర్నర్ ఈరోజు అమరావతికి వచ్చారు. ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత చంద్రబాబు గవర్నర్‌తో భేటీ అయ్యారు.
ఈ సమావేశంలో చంద్రబాబు అటు కేంద్రాన్ని, ఇటు గవర్నర్ ని కడిగి పారేసారు. రాష్ట్రం ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే కేంద్రం కనీసం పట్టించుకోవటం లేదని, పైగా కుట్రలు చేస్తుందని అన్నారు. రాష్ట్రానికి న్యాయం చేసే విషయంలో, మీ నుంచి ఎటువంటి సహాయం అందటం లేదని, గవర్నర్ తో తేల్చి చెప్పారు. శ్రీకాకుళంలో భీకర తిత్లీ తుపాను వస్తే, కేంద్రం కనీస స్థాయిలో కూడా సాయం చేయలదని చెప్పారు. కేంద్రం సహకారం లేకపోవడం వల్లనే కడపలో ఉక్కు కర్మాగారం, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతోందని తెలిపారు. ఇదే సందర్భంలో, జగన్ కోడి కత్తి దాడి విషయంలో, మీరు అతిగా జోక్యం చేసుకోవల్సిన అవసరం ఏముంది అంటూ, గవర్నర్ ను నిలదీశారు.
ముఖ్యమంత్రిని అయిన నన్ను అడగకుండా, డైరెక్ట్ గా మా ఆఫీసర్లను నివేదిక అడగటం పై ఆక్షేపించారు. ఇదే సమయంలో గవర్నర్ కూడా, సియంతో పాటు, మంత్రులు తన పై బహిరంగంగానే విమర్శలు చేయటం పై అభ్యంతరం వ్యక్తం చెయ్యటంతో, చంద్రబాబు అంతే రీతిలో సమాధానం చెప్పినట్టు తెలుస్తుంది. ఇన్నాళ్ళు ఢిల్లీ స్థాయిలో రాజకీయంగా ఎన్ని చేసినా, తన పై ఎంత బురద చల్లినా ఓర్పుగా ఉన్నానని, ఇప్పుడు ఏకంగా రాష్ట్రం పైనే కుట్రలు చేసి, శాంతి బధ్రతలు సమస్య సృష్టించాలనే కుట్రలు ఢిల్లీ స్థాయిలో జరిగాయనే పూర్తి సమాచారం తన వద్ద ఉందని, ఇలాంటి పనులు చేస్తే తగిన విధంగా ఢిల్లీ పెద్దలకు బుద్ధి చెప్తానని, ఇప్పటికే జాతీయ స్థాయి రాజకీయాల్లో ఏం చేస్తున్నానో చూసారాగా, వాళ్ళని వదిలిపెట్టను, ప్రజల ముందు దోషిగా నిలబెడతా అని చంద్రబాబు, ఒకింత ఘాటుగానే గవర్నర్ తో అన్నట్టు సమాచారం. గత 15 రోజులుగా జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు దూకుడుతో, పరిణామాలు వేగంగా మారుతున్న విషయం తెలిసిందే.