మోదీది అత్యంత సంపన్నుల పార్టీ.. టన్నుల కొద్దీ డబ్బు ఉంది.. అదంతా ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారు..అందుకే రెండువేల రూపాయల నోటు రద్దుచేయలేదు.. ప్రజాస్వామ్యాన్ని ఈవీఎం చిప్ మేనేజ్‌మెంట్ కు అప్పగిస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. బ్యాలెట్ ఓటింగ్ వల్ల నష్టమేంటని ప్రశ్నించారు. అభివృద్ధిలో ఏపీ నమూనా గుజరాత్‌ను మించిపోతోందనే కసితోనే మోదీ అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. కేసీఆర్‌కు కావాల్సింది కూడా ఇదే.. ఏపీలో కీలుబొమ్మ ప్రభుత్వం ఉండి.. అస్థిరత నెలకొంటే జాతీయ స్థాయిలో ప్రయోజనం పొందాలనే టీడీపీ ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శించారు. ఉండవల్లి ప్రజావేదికలో ‘ప్రభుత్వ పాలన’ (గవర్నెన్స్)పై శే్వతపత్రం-2ను ముఖ్యమంత్రి సోమవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాకు శే్వతపత్రంలో అంశాలను విశదీకరించారు.

modi topi 24122018 2

గత నాలుగున్నరేళ్లలో రాష్ట్రంలో ఏర్పాటైన ఐటీ పరిశ్రమలు గుజరాత్‌లో కూడా లేవన్నారు. దూరదృష్టి.. లక్ష్యం ఉంటే ఏదైనా సాధించ గలమన్నారు. తలసరి ఆదాయంలో ధనిక రాష్ట్రం, జనాభా తక్కువ ఉన్న తెలంగాణ సైతం మన రాష్ట్రం కంటే వెనుకబడి ఉందన్నారు. ఈ కారణంగానే మోదీ, కేసీఆర్‌లు తమపై కక్షకట్టారని ఆరోపించారు. కీలుబొమ్మ ప్రభుత్వం ఉండి, ఏపీలో అస్థిరత ఉంటే తాము లబ్ధిపొందాలనుకోవటం మంచి పద్ధతి కాదన్నారు. గత నాలుగున్నరేళ్లలో మోదీ వ్యవస్థలను భ్రష్టు పట్టించారని దీనివల్ల ఓటమి పాలయ్యారని విమర్శించారు. గుజరాత్‌లో 12 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏం ఒరగబెట్టారని నిలదీశారు. అన్న క్యాంటీన్‌లు, చంద్రన్న బీమా, రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ, మైక్రో న్యూట్రియంట్స్, పండుగ కానుకలు దేశంలో ఎక్కడా అమలు కావటం లేదని తెలిపారు. దేశానికి ఇప్పుడు ఏపీ లీడర్‌గా నిలిచే స్థాయికి చేరిందన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌పై తెలంగాణ అభ్యంతరం చెప్పటంలో అర్థం లేదన్నారు. ఎగువన కాళేశ్వరం నిర్మిస్తూ దిగువన కట్టే ప్రాజెక్ట్‌లకు అభ్యంతరం చెప్పటమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నా అధిగమిస్తున్నామని స్పష్టం చేశారు.

modi topi 24122018 3

వివిధ శాఖల పరిధిలో మొత్తం 615 అవార్డులు సాధించటం వెనుక అధికార యంత్రాంగం కష్టం ఉందన్నారు. ప్రజల ఆహార అలవాట్లలో మార్పుల కనుగుణంగా చెత్త, వ్యర్థాల నిర్వహణతో సంపద సృష్టించే స్థితికి చేరామన్నారు. అత్యుత్తమ సంస్థలు, జవాబుదారీతనం, ప్రభుత్వ విధానాలు, వినూత్న ఆలోచనలతో అభివృద్ధిపధంలో రాష్ట్రం దూసుకు పోతోందని వివరించారు. పోలవరానికి కేంద్రం డబ్బులు మాత్రం ఇవ్వదు.. తప్పకపోవటంతోనే అవార్డులు ఇస్తోందని వ్యాఖ్యానించారు. ఒడిశా ప్రభుత్వంతో సమావేశపరిచేందుకైనా ప్రయత్నించటం లేదని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో నష్టపరిహారాన్ని చెల్లించే దిశగా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు. తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తే ఎన్టీఆర్‌కు ద్రోహం చేసినట్లు మోదీ విమర్శించటంలో అర్థం లేదన్నారు. జాతీయ స్థాయిలో తృతీయ ఫ్రంట్ అనేది చరిత్రలోలేదని, కాంగ్రెస్, బీజేపీలకు మద్దతివ్వక తప్పని పరిస్థితులు నెలకొన్నాయని వివరించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు హాస్యాస్పదమన్నారు. బీజేపీ యేతర ఐక్య ఫ్రంట్‌కు తమ ప్రయత్నాలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read