చంద్రబాబు తన వ్యక్తిగత జీవితంలో ఎంత క్రమశిక్షణ పాటిస్తారో అందరికీ తెలిసిందే... తినే ఆహరం దగ్గర నుంచి, వ్యాయామం దాకా, గత నలభై ఏళ్ళ నుంచి ఒకటే కొట్టుడు... ముఖ్యమంత్రి అయినా, ప్రతిపక్ష నాయకుడు అయినా, బస్సు యాత్ర అయినా, పాద యాత్ర అయినా, ఈయన లైఫ్ స్టైల్ మారాదు.. చివరకి అమెరికా వెళ్ళినా, దావోస్ వెళ్ళినా ఆయన తినేది రాగి ముద్దే... అందుకే, 70 ఏళ్ళ వయసులో కూడా, యువకులకంటే స్పీడ్ గా ఉంటారు... రోజుకి 18 గంటలు కష్టపడతారు...

నిన్న చంద్రబాబు ప్రెస్ తో మాట్లడుతూ, మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా చెప్పారు... "రోజు 45 నిమిషాలు వ్యాయామం ఎలా చేస్తానో, 15 నిమషాలు విజువలైజేషన్ చేసుకుంటాను... నేనేంటి, ఎక్కడి నుంచి వచ్చా, ఎలా పెరిగా... నేను ఏం చేయాలి, నా లక్ష్యం ఏంటి ఆలోచిస్తా..." అంటూ మంచి విషయం చెప్పారు...

అలాగే చంద్రబాబు తన డైట్ గురించి కూడా చెప్పారు.. తాను బతకటం కోసం తింటానానని, తినటం కోసం బతకనని చెప్పారు. ఉదయం రాగి లేదా జొన్నతో చేసిన ఇడ్లీ, అటుకుల ఉప్మా, మధ్యలో టీ లేదా కాఫీ తాగుతా. మధ్యాహ్నం జొన్న లేదా రాగి సంకటి, రెండు కూరలు, మొలకలు తీసుకుంటా. సాయంత్రం 6.30- 7 గంటల మధ్య సూప్‌, ఓ చిన్న ఫ్రూట్‌, ఎగ్‌ వైట్‌‌‌తో కూడిన అల్పాహారాన్ని తీసుకుంటానని వెల్లడించారు... ఆరు గంటలు మాత్రమే నిద్ర పోతానని చెప్పారు.

నిజానికి, ఎవరైనా ఇలా విజువలైజేషన్ చేసి ఆలోచిస్తే, జీవితంలో చాలా క్లారిటీ ఉంటుంది... మనం ఏ స్థాయిలో ఉన్నా, మనం ఎక్కడ నుంచి వచ్చాం, ఎంత కష్టపడి పైకి వచ్చాం ఇలా ఆలోచిస్తే, మన ఇగో కూడా కంట్రోల్ లో ఉంటుంది. అలాగే, మనం ఈ రోజు ఏమి చెయ్యాలి, నిన్న చేసిన తప్పులు ఏంటి, మన లక్ష్యం వైపు ఎలా వెళ్తున్నాం అనేది అలోచిస్తే, జీవితంలో చాలా క్లారిటీ ఉంటుంది... చంద్రబాబులా, మనం డైట్ కంట్రోల్ చేసుకోలేము కాని, ట్రై చేద్దాం... వ్యాయామం కూడా రోజు ఒక అరగంట అన్నా చేస్తే, ఫిట్ గా ఉండొచ్చు, మన పనులు పర్ఫెక్ట్ గా చేసుకోవచ్చు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read