తిత్లీ తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లాలో జరిగిన విధ్వంసం అందరికీ తెలిసిందే. తిత్లీ తుపాను వల్ల 3673 కోట్ల రూపాయల మేర నష్టం వాటల్లిందని కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి వివరించడం తెలిసిందే. అయితే కేంద్రం మాత్రం, తిత్లీ తుపాను సహాయం కింద కేంద్రం ఇప్పటి వరకూ పైసా కూడా విడుదల చేయలేదు. ఆర్థిక సంఘం ప్రతిపాదన మేరకు రాష్ట్రానికి విపత్తు సహాయ నిధికి కేంద్రం ఇవ్వాల్సిన మొత్తంలో గత ఆగస్టులో 190 కోట్ల రూపాయలు విడుదల చేసింది. తాజాగా 229 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అవే తిత్లీ తుపాను సాయం అని కేంద్రం ప్రకటించింది.

titlei 04112018 2

మరో పక్క, ఈ 229 కోట్లు, నేను ఒత్తిడి తేవటం వల్లే అని పవన్ కళ్యాణ్ సిగ్గు లేకుండా ప్రకటించుకున్నాడు. అసలు రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆర్థిక సంఘం ప్రతి సంవత్సరం రాష్ట్ర విపత్తుల సహాయ నిధికి కేటాయించాల్సిన నిధుల మనకు ఇస్తే, అది తిత్లీ తుపాను సాయంగా కేంద్రం మోసం చేస్తుంటే, ఆ మోసాన్ని పవన్ సమర్దిస్తున్నాడు. అయితే వీళ్ళ ఏడుపులు ఎట్లా ఉన్నా, చంద్రబాబు మాత్రం, కేంద్రం సాయం చెయ్యలేదు కాబట్టి, నేను చెయ్యను అని చెప్పి తప్పించుకోలేదు. ఇబ్బందుల్లో ఉన్నా సరే, తితలీ తుఫానుతో దెబ్బతిన్న ప్రజలు, రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.561.99 కోట్లను విడుదల చేసింది.

titlei 04112018 3

పడవలు కోల్పోయిన మత్స్యకారులకు లక్ష చొప్పున, మెకనైజ్డ్ బోట్లకు రూ 6లక్షలు, వలకు రూ 10వేలు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్యకారులకు 50 శాతం సబ్సిడీతో పడవలకు పరిహారం చెల్లిస్తారు. ధ్వంసమైన రొయ్యల చెరువులకు హెక్టార్‌కు రూ.30వేలు పరిహారం అందిస్తారు. తుపానులో మృతిచెందిన ఎడ్లకు రూ.30వేల చొప్పున, మేకలకు రూ.3వేలు, పశువుల పాకకు రూ.10వేలు, నూతన నిర్మాణాలకు ఎన్‌ఆర్‌ఈజీఎస్, గోకులం పథకం కింద రెండు పశువులకు రూ లక్ష, నాలుగింటికి లక్షన్నర, ఆరింటికి లక్షా 80వేలు మంజూరు చేస్తారు. పౌల్ట్రీ సెక్టార్‌లో పూర్తిస్థాయిలో దెబ్బతిన్న కోళ్లఫారాలకు రూ.10వేలు, ఫారం కోళ్లకు రూ.150, బ్రాయిలర్ కోళ్లు మృతిచెందితే రూ.75 చొప్పున పరిహారం ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు రూ.10వేల పరిహారంతో పాటు ఎన్టీఆర్ గృహనిర్మాణ పథకం కింద రూ.2.5 లక్షలతో ఇళ్లను నిర్మిస్తారు. షాపులు కోల్పోయిన చిరువ్యాపారులకు రూ.10వేల చొప్పున మంజూరు చేస్తారు. ఇదిలా ఉండగా తుపానుకు దెబ్బతిన్న పరిశ్రమలు, రైస్‌మిల్లులకు సంబంధించి నష్టపరిహారం మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read