ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన పని, ప్రజల మన్ననలు పొందింది... ఒక ముఖ్యమంత్రే, సామాన్యుడు దగ్గరకు వెళ్లి, విషయం కనుక్కుని సాయం చెయ్యటం చాలా అరుదు... పోగొండ రిజర్వాయర్ ప్రారంభోత్సవానికి, పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి కామవరపుకోట మండల పార్టీ మాజీ సెక్రటరి టిడిపి విరాభిమాని షేక్ మహబూబ్ పడుతున్న ఇబ్బంది గురించి, స్థానికంగా ఉన్న ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళారు..
కామవరపుకోట మండలనికి చెందిన, షేక్ మహబూబ్ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, మహబూబ్ ఆరోగ్య పరిస్థితి గురించి మాగంటి బాబు గారు,కె.కోట జడ్పీటీసీ ఘంటా సుధీర్ బాబుగారు,కె.కోట ఉపసర్పంచ్ నెక్కలపు సూర్యనారాయణ గారు,కోనేరు సుబ్బారావు గారు చంద్రబాబు గారికి తెలిపారు... వెంటనే స్పందించి మాబు దగ్గరకు వచ్చి నీకు నేను అండగా వుంటాను అని చెప్పి 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
నాలుగు సంవత్సారాల క్రితం భయంకరమైన అరుదైన మోటార్ న్యూరో డిసిస్ గురవ్వగా, అతని వైద్యానికి అయ్యె ఖర్చు కుటుంబానికి అర్దికంగా భారమై కుటుంబ పరిస్థితి అగమ్యగోచరంగా వుండటంతో, వారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పటంతో, చంద్రబాబు స్వయంగా ఆ బాధితుడు దగ్గరకు వెళ్లి, కారులో ఉన్న అతన్ని పరామర్శించి, అన్ని విధాలుగా ఆదుకుంటాను అని, ఏమి ఇబ్బంది పడవద్దు అని, ఇప్పుడే 20 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరుపున ప్రకటిస్తున్నా అని, అతనికి భరోసా ఇచ్చారు... మెరుగైన చికిత్సకు గల అవకాశాలను చూడమని, అక్కడ అధికారులకి చెప్పారు...