నాలుగేళ్ళు చంద్రబాబు శభాష్ అంటూ, గత మార్చ్ నుంచి ఉన్నట్టు ఉండి, చంద్రబాబు పై విరుచుకు పడుతున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు జగన్ మోహన్ రెడ్డి కూడా మాట్లాడని విధంగా, పరుష పదజాలంలో చంద్రబాబుని తిడుతున్నారు. ఒక పక్క చంద్రబాబు బీజేపీతో పోరాడుతుంటే, చంద్రబాబుని బలహీనపరుస్తూ, నేషనల్ మీడియాకు ఎక్కి మరీ చంద్రబాబుని తిడుతున్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబుకు ఇంగితం లేదు అన్నారు... చంద్రబాబు ఇసుక కరా కరా తింటున్నారు అన్నారు... మేము రోడ్లు వేసాం అని లోకేష్ అంటుంటే, ఏ ఇది నీ తాత గాడి సొమ్ము ఏమన్నా తెచ్చి పెడుతున్నావా ? మీ నాన్న నువ్వు కలిసి, కంకరు, సిమెంట్ కలుపుతున్నారా అనే దిగజారుడు, చౌకబారు ఆరోపణలు చేస్తున్నాడు పవన్... ఇక పవన్ సినిమా అభిమానులు అయితే, సోషల్ మీడియాలో చంద్రబాబుని, లోకేష్ ని ఎలా తిడుతున్నారో చెప్పే పని లేదు..

cbn pk 04072018 2

పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు వీరబాబుకు కిడ్నీ అత్యవసర ఆపరేషన్‌కు బడేటి ట్రస్టు ద్వారా రూ.5లక్షల చెక్కును సీఎం చంద్రబాబు అందజేశారు. మరో రూ.3లక్షలు సీఎం సహాయనిధి నుంచి అందించేందుకు హామీ ఇచ్చారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వీరబాబు చికిత్సకు రూ.8లక్షలు ఖర్చు అవుతుందని, తమ ట్రస్టు ద్వారా రూ.5లక్షల ఆర్థిక సహాయాన్ని అందించామని ఎమ్మెల్యే బడేటి బుజ్జి తెలిపారు. సీఎంఆర్‌ఎఫ్‌ నుంచి మరో రూ.3లక్షలు అందించాలని కోరగా సీఎం సానుకూలంగా స్పందించారు.

cbn pk 04072018 3

విభజన తర్వాత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ... మానవీయ స్పందనలో మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గడంలేదు. ఎవరైనా వైద్యానికి ఆర్థిక సాయం కోసం వచ్చినప్పుడు వారి పరిస్థితిని ఆరా తీసి, అవసరాన్ని బట్టి ఎంత మొత్తం అన్నది రాస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్లలో సుమారు 50వేల మందికి సీఎం సహాయనిధి నుంచి ఆర్థికసాయం అందించారు. వైద్య అవసరాలను బట్టి రూ.20వేల నుంచి రూ.20లక్షల పైవరకు సాయం మంజూరు చేశారు. ఇప్పటికి రూ.370కోట్లను అందించారు. గత ప్రభుత్వ హయాంలో 2009నుంచి 2012వరకు నాలుగేళ్లలో సుమారు 26వేల మందికి సీఎం సహాయ నిధి నుంచి రూ.127కోట్లు సహాయం అందింది. అదికూడా... సమైక్యాంధ్రలోని 23 జిల్లాలకు కలిపి. కానీ, ఈ మూడేళ్లలో 13జిల్లాల ఏపీకే 50వేల మందికి రూ.370కోట్ల సాయం చేశారు. గతంతో పోలిస్తే ఇది ఐదారు రెట్ల కంటే ఎక్కువ అని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. పవన్ కళ్యాణ్ ఎదో మాట్లాడాలి కాబట్టి విమర్శించి చేతులు దులుపుకోవటం కాదు.. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోండి... విమర్శలు హేతుబద్ధంగా ఉంటే, అందరికీ ఉపయోగం ఉంటుంది...

Advertisements

Advertisements

Latest Articles

Most Read