ఏడాదిన్నర పసి బాలుడుకు అరుదైన చర్మ వ్యాధి సోకింది... రెక్కాడితే కానీ డొక్కాడని బడుగు జీవికి కుమారుడుగా జన్మించడం ఆ బిడ్డడి తప్పయింది... తన పాలనలో ఎవరికి ఏ కష్టమొచ్చినా తెలిసినంతనే ఆదుకునే మానవత్వం ఉన్న మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉండటం ఆ బిడ్డడికి అదృష్టమైంది. కుప్పం నియోజకవర్గంలోని రామకుప్పం మండలం బండారుపల్లికి చెందిన అరుణ, ఏకాంబరం దంపతుల ఏడాదిన్నర కుమారుడికి వ్యాధి సోకి చర్మంపై మచ్చలు ఏర్పడ్డాయి. వ్యవసాయ చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఏకాంబరానికి దిక్కుతోచలేదు. రైతుకు తన కుమారుడికి చికిత్స చేయించడం కష్టమయింది. .తనకున్న శక్తి మేరకు స్థానికంగా చికిత్స చేసినా కుమారుడి చర్మవ్యాధి తగ్గలేదు...మరింత మెరుగైన ఆధునిక విదేశీ వైద్యం చేస్తేగానీ తగ్గదన్నారు డాక్టర్లు...ఖర్చు కూడా పెద్దమొత్తం అవుతుందనడంతో ఆ తల్లిదండ్రులకు దిక్కుతోచలేదు...
దిక్కులేని వారికి ఆ దేవుడే దిక్కన్నట్లు... ప్రత్యక్ష దైవమైన ముఖ్యమంత్రి చంద్రబాబు స్మురణకు వచ్చాడు...గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రి చంద్రబాబుకు విన్నవించుకుంటే మానవతా దృక్పథంతో ఆదుకున్న సంఘటనలు గుర్తు చేసుకున్నారు ఆ తల్లిదండ్రులు...దూరాభారమైనా కుప్పం నుంచి బిడ్డని చంకన వేసుకుని ఆ తల్లిదండ్రులు ఉండవల్లిలోని నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి కొడుకుకు వచ్చిన కష్టాన్ని చెప్పుకున్నారు...తక్షణం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ పసిబిడ్డడి వైద్య చికిత్సకు రూ. లక్ష మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆదుకునే హస్తం ఆపదలో ఉన్న పేదలకు అండగా నిలబడే నేస్తంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిలిచారని బిడ్డను తీసుకుని అరుణ, ఏకాంబరం దంపతులు సంతోషంతో ఇంటి ముఖం పట్టారు.