ఇది వరకు చంద్రబాబు అయితే ఇలాంటి ఎమోషన్స్ కు అస్సలు లోనయ్యేవారు కాదు... కాని వయసుతో పాటు వచ్చిన సున్నితత్వమో, లేక చంద్రబాబు చెప్ప్తున్నట్టు 2012లో చేసిన పాదయత్ర అనుభవమో కాని, ప్రజలకు కష్టం ఉంది అని తెలిస్తే చాలు, వారికి సహాయం చేస్తున్నారు... మరీ ఇబ్బందికర పరిస్థుతులు చుస్తే, ఉద్వేగబరితుడై కన్నీళ్లు తెచ్చుకుంటున్నారు.

ఇలాంటి ఘటనే నిన్న కర్నూల్ జిల్లలో జరిగింది... నోబుల్ గ్ర‌హీత కైలాశ్‌ సత్యార్థి ప్రారంభించిన ‘భారత్‌ యాత్ర’లో చంద్రబాబు కర్నూల్ జిల్లలో పాల్గున్నారు. ఆ సందర్భంలో విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.

అందులో ఒక యువతి మాట్లాడుతూ ‘‘కర్నూలు జిల్లాకు చెందిన నేను 9వ తరగతి దాకా చదువుకొన్నాను. ఓ యువకుడ్ని ప్రేమించి అతనితో పాటు వెళ్లిపోయాను. ఆ యువకుడు నన్ను హైదరాబాద్‌కు తీసుకెళ్లి రూ.35 వేలకు అమ్మేశాడు. షాక్‌ నుంచి తేరుకునేలోపే ముంబై రెడ్‌లైట్‌ ఏరియాలో ఉన్నాను. కొంత కాలానికి ఓ కస్టమర్‌ ద్వారా తప్పించుకుని కర్నూలు చేరుకున్నా. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. నలుగురు అన్నలు ఉన్నా వారి వద్దకు వెళ్లలేక ఆత్మహత్య చేసుకుందామనుకున్నా. చివరికి పోలీసుల సాయంతో ఐసీడీఎస్‌ అధికారుల వద్దకు చేరాను. ప్రస్తుతం కర్నూలు సెంట్రల్‌ హోంలో ఉండి 10వ తరగతి చదువుతున్నాను. నాలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు.’’ అని కన్నీటిపర్యంతమైంది.

ఆ బాలికను చూసి చలించిపోయిన సీఎం వెంటనే లేచి ఆమెను అక్కున చేర్చుకున్నారు. ఆ బాలికకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. ఆమె పేరున రూ.5 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు.

తండ్రి చేతిలో అత్యాచారానికి గురైన మరో చిన్నారికి కూడా రూ.5 లక్షలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read