తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈ దేశంలోనే ఒక సీనియర్ నాయకులు. ఆయన భద్రత కోసం, జెడ్ ప్లస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఎన్ని పార్టీలు కేంద్రంలో మారినా, చంద్రబాబుకు ఉన్న జెడ్ ప్లస్ సెక్యూరిటీ మాత్రం తీయలేదు. చంద్రబాబు అనుక్షణం ఎన్ఎస్జజీ కమెండోల రక్షణలో ఉంటారు. కేంద్రం నుంచి వచ్చిన బలగాలు చంద్రబాబుని అనుక్షణం రక్షిస్తూ ఉంటాయి. ఇది ఇలా ఉంటే, రాష్ట్రంలో మాత్రం, ఆయన సెక్యూరిటీ పై వివక్ష చూపుతుందనే విమర్శలు తరుచూ వినిపిస్తూ ఉంటాయి. జెడ్ ప్లస్ భద్రత ఉన్న చంద్రబాబు ఇంటి మీదకు, 30 కారు, 100 మందికి పైగా జనాలు, వస్తున్నా, పోలీసులు నిలువరించలేదనే ప్రచారం ఉంది. ఏకంగా ఆయన ఇంటి మెడకు రాళ్ళ దా-డి చేసే దాకా వెళ్ళింది. ఇక అధికారం వచ్చిన కొత్తలో చంద్రబాబుకి ఉన్న సెక్యూరిటీ కూడా తగ్గించారు. దీంతో చంద్రబాబు కోర్టుకు వెళ్లి పోరాడి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇక వరదల పేరు చెప్పి, ఆయన ఇంటి పై డ్రోన్ ఎగురవేసారు. అలాగే, ఆయన కాన్వాయ్ లో ఉండే వెహికల్స్ కూడా సరైనవి ప్రభుత్వం ఇవ్వటం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇలా అనేక అవాంతరాల మధ్య చంద్రబాబు ముందుకు వెళ్తున్నారు.
అయితే తాజాగా మరో సంఘటనతో, టిడిపి నేతలు ఉలిక్కి పడ్డారు. గత నాలుగు రోజులుగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం దగ్గర చీకట్లు అలుముకున్నాయి. చంద్రబాబు ఇంటి చుట్టూ పొలాలు ఉండటం, మరో వైపు కృష్ణా నది, ఇవన్నీ ఉన్నా సరే, లైట్లు వేయకపోవటంతో, మొత్తం చీకట్లు అలుముకున్నాయి. చంద్రబాబు ఇంటి సమీపంలో ఉన్న, చుట్టు పక్కలా, వీధి దీపాలు వెలగడం లేదు. చంద్రబాబు ఉండవల్లి నివాసం కరకట్ట దారిలో ఉంది. అయితే ఈ కరకట్ట మార్గంలో చాలా వరకు లైట్లు అన్నీ ఆగిపోయాయి. కేవలం కొండవీటి వాగు దాటాక కొన్ని లైట్లు వెలుగుతున్నాయి. ఇక చంద్రబాబు ఇంటి నుంచి, మంతెన ఆశ్రమం వరకు ఒక్క లైట్ కూడా వెలగతం లేదు. ఒక రోజు అంటే, ఏదో సమస్య అనుకున్నారు. గత నాలుగు రోజులుగా ఇదే పరిస్థితి ఉంది. చంద్రబాబు ఇంటి వద్ద, అవుట్ పోస్ట్ వద్ద ఉండే, సెక్యూరిటీ సిబ్బంది కూడా, ఆ చీకట్లోనే ఉండాల్సిన పరిస్థితి. జెడ్ ప్లస్ ఉన్న చంద్రబాబు ఇంటి పై ఎందుకు ఇంత నిర్లక్ష్యం అంటూ టిడిపి ప్రశ్నిస్తుంది. చంద్రబాబు సెక్యూరిటీ సిబ్బంది, తాము పై అధికారులకు చెప్పామని, అయినా మార్పు లేదని చెప్తున్నారు.