ఇవాల్టి నుంచి రాష్ట్రంలో ఐదవ విడత, ‘జన్మభూమి-మాఊరు’ కార్యక్రమం మొదలైన సంగతి తెలిసిందే... రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రకాశం జిల్లా దర్శిలో జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గున్నారు... ‘అభివృద్ధి సాధిద్దాం-జైత్రయాత్ర సాగిద్దాం’ అనే నినాదంతో ఇవాళ జన్మభూమి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గున్న ముఖ్యమంత్రి, బహిరంగ సభలో మాట్లాడారు.. అంతకు ముందు ప్రజలతో కూడా మాట్లాడించారు... ఈ సందర్భంలో విజయ్ కుమార్ అని బుడతడి ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది...
విజయ్ కుమార్ అనే స్కూల్ పిల్లవాడు స్టేజి మీదకు రాగానే, ముఖ్యమంత్రి చంద్రబాబు అతని స్కూల్ క్లాసు రూమ్ పిల్లలతో స్టేజి మీద నుంచే వీడియో కాన్ఫరెన్స్ తో స్కూల్ పిల్లలతో మాట్లాడుతూ, విజయ్ కుమార్ చిన్న పిల్లవాడు అయినా భయం లేకుండా ఇక్కడ దాకా వచ్చి, ముఖ్యమంత్రి ముందు మాట్లాడుతున్నాడు అంటే, అతని ధైర్యం చొరవ మెచ్చుకోవాలని, అందరూ ఇలాగే ధైర్యంగా ఉండాలి అని చెప్పి, విజయ్ కుమార్ ని మాట్లాడమన్నారు... ఆ బుడతడు అనర్గళంగా 5 నిమషాల పాటు ముఖ్యమంత్రి, మంత్రులు, ఐఎస్ఎస్ ఆఫీసర్ల ముందు, ఏ మాత్రం భయం లేకుండా మాట్లాడి, అందరినీ ఆకట్టుకున్నాడు...
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పధకాలు, వాటి ఉపయోగాలు చెప్పాడు... నవ్యాంధ్ర నిర్మాణం కోసం ముఖ్యమంత్రి ఎంత కష్టపడుతున్నారో చెప్పి, మనందరం ఆయనకు సహకరించాలని చెప్పారు.. అలాగే ప్రజలకు ఉండే బాధ్యతలు చెప్తూ, ఇలా 5 నిమషాలు ప్రసంగించారు... బుడ్డోడు ప్రసంగిస్తున్నంత సేపు, చంద్రబాబు ముసి ముసి నవ్వులు నవ్వుతూ కనిపించారు... తరువాత, సభ ముగిసే సమయానికి, ఆ బుడతడిని పైకి పిలిచి, తను చూపించిన చొరవ, సమాజం పట్ల ఉన్న అవగాహన నచ్చి, మరింత మందికి స్పూర్తి అవ్వాలి అని కోరుకుంటూ, ఆ బుడతడికి 50 వేలు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నట్టు ప్రకటించారు.... వెంటనే చెయ్యమని కలెక్టర్ ని ఆదేశించారు... అంతే కాదు ఒక ట్యాబ్ కూడా ఇవ్వమని, ఆ ట్యాబ్ చదువుకి ఉపయోగపడాలి అని చెప్పారు... విజయ్ కుమార్ అనే ఈ బుడతడు, నిరు పేద కుటుంబం నుంచి వచ్చిన వాడు, తండ్రి కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు, ఇవాళ తన ప్రతిభతో సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునే మెప్పించాడు... బుడతడికి మంచి భవిష్యత్తు ఉండాలి అని కోరుకుందాం...