ఈ రోజు అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడారు... కొత్తగా ఏర్పడిన మన రాష్ట్రాన్ని పసిపాపలా సాకుతున్నామని, చంద్రబాబు అన్నారు.. ఎన్నో ఎదురు దెబ్బలు తట్టుకుని, ఎదుర్కుని సంక్షోభాలను అవకాశాలుగా మార్చుకుని, విభజన వలన వచ్చిన సమస్యలను ఇప్పుడిప్పుడే పరిష్కరిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేంద్రం నుంచి గతంలో పదో, ముప్పయ్యో కోట్లు ఇచ్చేసి చేతులు దులుపుకునే వారని, నా పరిచయాలతో ఏపీకి ఎక్కువ నిధులు తెచ్చానని చంద్రబాబు పేర్కొన్నారు.

ap cbn 18012018 2

అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ జన్మభూమి-మాఊరు’ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాం, అధికారులు-ఉద్యోగులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని అన్నారు. తొమ్మిది అంశాలపై సర్వత్రా చర్చ జరగడాన్ని స్వాగతిస్తున్నామని, ప్రజాసేవే పరమావధిగా పనిచేయాలని, 80% సంతృప్తి తీసుకురావావటమే మన టార్గెట్ అని అన్నారు... పేదలకు ఉచిత విద్యుత్ పథకం కింద 9.5 లక్షల కనెక్షన్లు అందిస్తున్నమని చెప్పారు... అన్ని ప్రభుత్వశాఖలను ఆన్‌లైన్‌లో పెట్టమన్నారు... పూర్తి స్థాయి సంతృప్తి ఫలితాలు రాకపోవడానికి కారణాలేంటనే అంశం పై లోతుగా విశ్లేషించాలని చంద్రబాబు కలెక్టర్లతో అన్నారు...

ap cbn 18012018 3

మార్చిలోపు ‘కాగిత రహిత కార్యాలయాలు’ లక్ష్యాన్ని సాధించాలని, ఇది చేయగలిగితే మరింత సమర్ధంగా పనిచేసే అవకాశం దక్కుతుందని అన్నారు... ప్రాధాన్యతాక్రమంలో ఆర్ధికేతర వినతులు ముందుగా పరిష్కరించడంతో పాటు పెండింగ్‌లో వున్న ప్రాజెక్టులను పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు... జిల్లాల కలెక్టర్లు జవాబుదారీతనం తీసుకోవాలని, ప్రతి జిల్లా కలెక్టరు జిల్లా స్థాయిలో జవాబుదారీగా ఉండాలని చంద్రబాబు చెప్పారు... ఇక మీదట త్రైమాసిక ఫలితాలు వచ్చిన వెనువెంటనే పనితీరు పై ఉన్నతాధికారులు, కలెక్టర్లు విశ్లేషించుకునేలా 3 రోజుల పాటు సమావేశాలు ఉంటాయి అని అన్నారు... యునైటెడ్ నేషన్స్ నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించేలా కలెక్టర్లు కృషి చేయాలని అన్నారు... అలాగే కష్టపడి ఫలితాలు సాధించిన కలెక్టర్లకు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read