పదేళ్లుగా చినుకు జాడలేని పల్లె జొన్నగిరి... కరువు తాండవిస్తున్న ఆ ఊరిలో సీఎం చంద్రబాబు ఆదివారం పర్యటించారు... వీధులన్నీ కలియదిరిగారు. జనం జేజేలు పలికారు... అంతకు మునుపు హెలి ప్యాడ్ కు చేరుకున్న చంద్రబాబును చూసి జనం చేతులు ఊపుతూ కేరింతలు కొట్టారు. డిప్యూటీ సీఎం కేఈతో కలిసి గ్రామవీధుల్లో పర్యటిస్తుండగా వృద్దులు, మహిళలు, పిల్లలు అభివాదం చేశారు. 'ఆమ్మా! నీ పెద్దకొడుకును వచ్చాను. నెలనెల పింఛన్ వస్తోందా...?' అని పలకరిస్తుంటే వృద్దులు పులకించిపోయారు. నెలనెలా ఇంటికే వచ్చి ఇస్తున్నారని వారు సమాధానం చెప్పినప్పుడు చంద్రబాబు సంతృప్తి చెందారు. 'ఏ బడిలో చదువుతున్నావు? ఎన్నో తరగతి..? బాగా చదువుకుని అమ్మనాన్నకు మంచి పేరు తేవాలి..' అని పిల్లలను పలకరిస్తూ ముందుకు సాగారు.

cbnhouse 04062018 2

'అమ్మా.. మీ చంద్రన్న ఇచ్చే పసుపు కుంకుమ డబ్బులు మీ ఖాతాల్లో పడ్డాయా..?' అని మహిళలను అడిగారు. 'ఖాతాలో వేశారు.. మంచి పనులను ఉపయోగించుకుంటున్నాం' అని వారు సమాధానం ఇచ్చారు. గ్రామ దర్శిని అనంతరం పదేళ్ల తరువాత నీరు చేరిన జొన్నగిరి చెరువు వద్దకు చేరుకుని జలహారతి పట్టారు. ఆ సమయంలో ఆకాశం నుంచి జల్లులు కురవడాన్ని ముఖ్యమంత్రికి ప్రకృతి ఆశీర్వాదమని పలువురు అభివర్ణించారు. 'ప్రకృతిని ఆరాధిస్తే కష్టాలు ఉండవు. ఈ వర్షమే అందుకు సాక్షం' అని సీఎం చంద్రబాబు పేర్కొన్న డంతో రైతులు చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేశారు. 68 చెరువులను కృష్ణాజలాలతో నింపే పథకానికి శంకుస్థాపన చేస్తున్నప్పుడు ఎన్నో ఏళ్ల కల సాకారం అవుతున్నందుకు డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి చిరునవ్వులు చిందిస్తూ సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు.

cbnhouse 04062018 3

అనంతరం చెక్ డ్యాం, పంట కుంట పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. 'భూగర్భ జలాలు పెరిగాయి. బోరుబావుల కింద పంటలు వేసుకుంటాం' అని రైతులు పేర్కొన్నప్పుడు సీఎం ఆనందంతో 'ఏ రైతూ బాధపడకూడదనే ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తున్నాం' అని అన్నారు. బహిరంగ సభలో అనర్గళంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన అన్యాయం, ప్రతిపక్ష వైఖరిపై ఎండగడుతుంటే జనం సానుకూల నినాదాలు చేశారు. వర్షం కురుస్తున్నా. సీఎం ప్రసంగం కొనసాగించారు. 'ఇక్కడ ఎక్కువసేపు ఉంటే హెలి క్యాప్టర్ పైకి లేయదు. నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది' అనడంతో జనం ఆనందంతో ఈలలు కేకలు వేశారు. అనంతరం సీఎం తన ఉపన్యాసం ముగించి హెలిప్యాడ్ కు చేరుకుని అమరావతికి బయలుదేరారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read