ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తొలి రోజు పర్యటన సూపర్ హిట్ అయ్యింది. కొరియా పారిశ్రామికవేత్తల నుంచి అనూహ్య స్పందన లభించింది. తొలిరోజు సోమవారం ముఖ్యమంత్రి ముందుగా కియా అనుబంధ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ముప్ఫయ్ ఏడు కంపెనీలతో కూడిన పారిశ్రామిక గ్రూపుతో ఆంధ్రప్రదేశ్ ఎకనమిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీ ఇ.డి.బి) ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ తీసుకున్నది. ఒప్పందాల విలువ అక్షరాలా మూడు వేల కోట్ల రూపాయలుగా అంచనా వేసింది. ఈ సంస్థల ద్వారా మొత్తం 7,171 ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సోమవారం తొలి సమావేశంలో ముఖ్యమంత్రి కియా మోటార్స్ అనుబంధ సంస్థల ప్రతినిధులతో సమావేశమైనప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వ్యాపార, వాణిజ్య స్నేహపూర్వక విధానాలను వారు మద్దతు పలికారు. మరో వైపు కియా అనుబంధ సంస్థలు మొత్తం కలిపి రూ.4,995.20 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి.

cbn korea 04122017 2

ఏపీలో పెట్టుబడులకు అనుకూలాంశాలపై కొందరు ప్రతినిధుల సందేహాలను ముఖ్యమంత్రి నివృత్తి చేశారు. ‘ఏపీలో మీకు ఎలాంటి వ్యాపార అవరోధాలు తలెత్తవని నేను మాటిస్తున్నాను. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే పరిష్కరిస్తానని మరోమారు స్పష్టం చేస్తున్నా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా ఇచ్చారు.‘పెట్టుబడులకు మీరు ఎంచుకున్న అనంతపురము జిల్లా అటు బెంగళూరు విమానాశ్రయానికి, ఇటు కృష్ణపట్నం నౌకాశ్రయానికి అనుసంధానంగా ఉంది. మౌలికవసతులు, శాంతిభద్రతలు సవ్యంగా ఉండటమే కాకుండా ఎటువంటి కార్మిక అశాంతి లేని వాతావరణం మా రాష్ట్రంలో ఉంది. మా రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావాలని మీలో ప్రతి ఒక్కరినీ ప్రత్యేకంగా కోరుతున్నా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు.

cbn korea 04122017 3

ఏపీ లో కొరియన్ సిటీ ఏర్పాటు వల్ల ఇరుదేశాలకు ఉభయతారకంగా ఉంటుందని, ఏపీని మీరు మీ రెండవ రాజధానిగా భావించి పెట్టుబడులు తేవాలని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. తమ రాష్ట్రంలో పుష్కలంగా నీరుందని, దేశంలో మిగులు విద్యుత్తు రాష్ట్రంగా ఆవిర్భవించి చరిత్ర సృష్టించామని అన్నారు. మిగులు విద్యుత్ ఉందని, ఇందుకు ఢోకా లేదని, మీరు అడిగిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని త్వరలోనే ఏర్పాటుచేస్తామని కియా అనుబంధ సంస్థల ప్రతినిధులకు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తమ పెట్టుబడుల ప్రణాళికలపై కియా అనుబంధ సంస్థలు పవర్ పాయింట్ ఇచ్చాయి. ప్రభుత్వ ప్రతిపాదిత ప్రాంతాలలో ఎంతమేర పెట్టుబడులు పెట్టేది ముఖ్యమంత్రికి కియా అనుబంధ సంస్థల ప్రతినిధులు వివరించారు. తాము ఏర్పాటుచేసే సంస్థల ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎంతమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయో వివరించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read