ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు సాయంత్రం బెంగుళూరు చేరుకున్నూరు... సాయంత్రం అక్కడ జరిగిన హడిల్ 2018 కార్యక్రమంలో చంద్రబాబు పాల్గున్నారు... ది హిందూ అధ్వర్యంలో జరిగిన ఈ కాంక్లావ్ లో ముఖ్యమంత్రిని, NDTV మ్యనిజింగ్ డైరెక్టర్ శ్రీనివాసన్ జైన్ ఇంటర్వ్యూ చేసారు, అదే సందర్భంలో, అక్కడకు వచ్చిన ఇన్వెస్టర్స్ ప్రశ్నలకు కూడా చంద్రబాబు సమాధనం చెప్పారు... ముఖ్యంగా, బీజేపీతో సంబంధాల పై, అమరావతి నిర్మాణం పై ఎక్కువగా ప్రశ్నలు వచ్చాయి... అలాగే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న వివిధ విప్లవాత్మిక కార్యక్రమాల పై కూడా చర్చలో డిస్కషన్ జరిగింది...
బీజేపీతో సంబంధాల పై చంద్రబాబు స్పందిస్తూ, విభజన జరిగిన విధానం పై చెప్పారు... రాష్ట్రానికి న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే భాజపాతో ఆ రోజు పొత్తుపెట్టుకున్నట్టు తెలిపారు. విభజన తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపులేకపోతున్నామని.. నవనిర్మాణ దీక్ష చేస్తున్నామన్నారు. హక్కుల కోసం ఎక్కడా రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టంచేశారు. ఇది ఐదు కోట్ల జనాభాకు, కేంద్రానికి సంబంధించిన విషయమని తెలిపారు. హామీలన్నీ నెరవేర్చాలని ఐదు కోట్లమంది ప్రజల తరఫున డిమాండ్ చేస్తున్నానని అన్నారు. చేయని తప్పునకు శిక్ష అనుభవిస్తున్నామని చంద్రబాబు అన్నారు. హేతుబద్ధతతో విభజన జరిగితే ఈ పరిస్థితి వచ్చేది కాదు.
ఇదే సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం, ఎంత వరకైనా వెళ్తాను అని ఇప్పుడే గుంటూరులో చెప్పి వచ్చారు, దీని మీద మీ కామెంట్ ఏంటి అని అడగగా... చంద్రబాబు స్పందిస్తూ, నేను గుంటూరు నుంచి ఇక్కడ వరకు బెంగుళూరు వచ్చాను, ఎందుకు వచ్చాను ? ఇక్కడ ఇన్వెస్టర్స్ ఉంటారు, నా స్టేట్ ని ప్రమోట్ చేసుకోవచ్చు అని వచ్చాను... దావోస్ వెళ్తున్నాను, వివిధ దేశాలు తిరుగుతున్నాను, 24 గంటలు రాష్ట్రం కోసం కష్టపడుతున్నాను... ఇవన్నీ ఎందుకు చేస్తున్నాను ? ముందు రాష్ట్రం, తరువాతే ఏదైనా, ఎంత వరకైనా వెళ్తాను, ఎంత వరుకైన కష్టపడతాను అని చంద్రబాబు చెప్పారు... ఈ మాటలతో, అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్, మీడియా ప్రతినిధులు, వివిధ డిగ్నిటరీస్ అందరూ, చప్పట్లు కొట్టి, చంద్రబాబుని అభినందించారు...