సంక్రాంతి సందర్భంగా సీఎం చంద్రబాబు పెద్ద కానుక అందించారు. పించన్లు రూ.2వేలకు పెంచుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. వెయ్య రూపాయలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేసారు. నెల్లూరు జిల్లా బోగోలు జన్మభూమిలో సీఎం ఈ ప్రకటన చేశారు. జనవరి నుంచే పెంచిన పించన్ చెల్లిస్తారు. దీని ద్వారా 54లక్షల మంది పించన్ దారులకు లబ్ది పొందుతారు. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు లబ్ది పొందుతారు. పించన్ నెలకు రూ.2వేలు చేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి నెల నుంచే ఈ పెంపు వర్తిస్తుంది. ఈ నెలలో వెయ్య రూపాయలే ఇవ్వటంతో, వచ్చే నెల రెండు వేలు, ఈ నెల పెంచిన వెయ్య కలిపి, వచ్చే నెలలో మూడు వేలు ఇవ్వనున్నారు. మార్చ్ నెల నుంచి యధావిధిగా రెండు వేలు ఇస్తారు.
2014కి ముందు నెలకి రూ.200గా ఉన్న అన్నిరకాల పింఛన్లను తెదేపా అధికారంలోకి వచ్చిన వెంటనే అయిదు రెట్లు పెంచి రూ.1,000 చొప్పున అందించింది. దివ్యాంగులకు, హిజ్రాలకు రూ.1,500 చేసింది. 2017 సెప్టెంబరు నుంచి డయాలసిస్ రోగులకు రూ.2,500 చొప్పున పింఛను అందిస్తోంది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లపై సమీక్షించి.. రెట్టింపు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో వృద్ధాప్య, వితంతువులకు పింఛను మొత్తం నెలకు రూ.2,000 చెల్లించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాల పింఛన్లు కలిపి 50,61,906 మందికి పంపిణీ అవుతున్నాయి. డిసెంబర్ ఆఖరు నాటికి వివిధ రకాల పింఛన్లు కావాలని కోరుతూ ప్రభుత్వానికి 2.5లక్షల దరఖాస్తులందాయి.
తాజా జన్మభూమి గ్రామ సభల్లో తొమ్మిదో తేదీ నాటికి పింఛన్ల కోసం మరో 1.05లక్షల దరఖాస్తులందాయి. ఇతర రూపాల్లో అందిన విజ్ఞప్తులకు మరో లక్ష మందికి ఇవ్వాల్సి వస్తుందనుకున్నా మొత్తం 4.55లక్షల కొత్త పింఛన్లు మంజూరయ్యే వీలుంది. వీటికి సైతం ఫిబ్రవరి నుంచే పెంచిన మొత్తం అందుతుంది. కొత్త వాటినీ కలిపితే మొత్తం పింఛన్ల సంఖ్య 55.16లక్షలకు చేరుతుంది. ఈ మేరకు ప్రభుత్వం వెచ్చించాల్సిన మొత్తం కూడా పెరుగుతుంది. కొత్త పింఛన్ల మంజూరుతోపాటు పెంచే మొత్తానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ రోజు చంద్రబాబు చెయ్యటంతో, ప్రతి పేదవాడు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజమైన సంక్రాంతి అని చెప్తున్నారు.