ఈ వార్తను చూసైనా బీజేపీ, వైకాపా, జనసేన లీడర్లకు బుద్ధి,జ్ఞానం వస్తుందని ఆశిద్దాం.... ఉభయరాష్ట్రాల ప్రజలే కాదు ప్రపంచస్థాయి నేతల మన్ననలు పొందిన తెలుగుతేజం శ్రీ నారా చంద్రబాబునాయుడు ఒక్కరే... ఇండియన్ ఐకానిక్ లీడర్.. చంద్రబాబును చాలా గొప్పగా పరిచయం చేసిన ఐక్యరాజ్యసమితి.. "ఇండియాలోని ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు చంద్రబాబు రాష్ట్రం వారే.. ఐటీ రంగంలో ఆయన ఎంతో ప్రగతిని సాధించారు.. మీ లీడర్ షిప్ కు, ఛాంపియన్ షిప్ కు ధన్యవాదాలు.." ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర పుటల్లోకి ఎక్కారు. ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన తొలి తెలుగు వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. 'జీరో బడ్జెట్ నేచురల్ ఫామింగ్' పై ఆయన కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబును ఐక్యరాజ్యసమితి ప్రతినిధులు చాలా గొప్పగా పరిచయం చేశారు.
"ఎక్సలెన్సీస్, లేడీస్ అండ్ జెంటిల్మన్. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చిన విజేతలు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఇండియాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మనతో ఉన్నారు. ఇండియాలో చంద్రబాబు ఒక ఐకానిక్ లీడర్. ప్రపంచంలోని ప్రతి నలుగురు ఐటీ నిపుణుల్లో ఒకరు భారతీయులే. ఇండియాలోని ప్రతి నలుగురు ఐటీ ఎక్స్ పర్ట్స్ లో ఒకరు చంద్రబాబు రాష్ట్రానికి చెందినవారే. భారతదేశ జనాభాలో చంద్రబాబు రాష్ట్ర జనాభా కేవలం నాలుగు శాతం మాత్రమే... అయినా దేశ ఐటీ నిపుణుల్లో 25 శాతం మంది ఆయన రాష్ట్రం వారే . ఐటీ రంగంలో ఆయన ఎంతో ప్రగతిని సాధించారు. మీ లీడర్ షిప్ కు, ఛాంపియన్ షిప్ కు ధన్యవాదాలు. మీ రాష్ట్ర అభివృద్ధి కోసం మీరు చాలా చేస్తున్నారు. ఏపీ, ఇండియా... వీలైతే ప్రపంచ భవిష్యత్తును మార్చగలరు. మీరు చేస్తున్నది వినాలనుకుంటున్నాం. మీరు మాతో ఉన్నందుకు ధన్యవాదాలు"... అంటూ చంద్రబాబును ఐక్యరాజ్యసమితి మోడరేటర్ ఈ విధంగా పరిచయం చేస్తున్నప్పుడు... సభాప్రాంగణం చప్పట్లతో మారుమోగింది.
చంద్రబాబు కూడా తెలుగులో ప్రసంగం చేసారు.. ప్రసంగం దాదాపు 25 నిమషాలు కొనసాగింది. చివరగా మాట్లాడుతూ "ఇక్కడి నుంచి మా భారత్‌కు వచ్చిన మిత్రులు మేం సాగిస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని పరిశీలించి పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. మీరంతా ఆంధ్రప్రదేశ్ కు రండి. మేం సాధిస్తున్న అభివృద్ధిని, ప్రజా జీవన ప్రమాణాల మెరుగుకు టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించండి. మిమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వ అతిథులుగా గౌరవిస్తాం. మీరు ప్రకృతి వ్యవసాయంలో మా కాన్సెప్ట్ నచ్చితే అంతర్జాతీయ సమాజానికి వేగవంతంగా అన్వయించే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్ధిక సంస్కరణలపై ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాను. కానీ ఇవాళ మీ సమక్షంలో ఈ ఐక్యరాజ్యసమితి వేదికపై నేనిచ్చిన ఉపన్యాసం నాకెంతో సంతృప్తిని ఇఛ్చింది. ప్రకృతి వ్యవసాయానికి విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించడానికి ఇది నాకు దక్కిన అద్భుత అవకాశంగా భావిస్తున్నాను. మీ అందరి సహకారాన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను." అని ముగించారు.