ఓడిపోయామ‌ని పారిపోలేదు..నిలిచారు..గెలుస్తున్నారు..ఇదీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు వ్యూహం. ఇదీ చంద్ర‌న్న చాణ‌క్యం. 2019 ఎన్నిక‌ల్లో దారుణ ప‌రాజ‌యంపై సొంత పార్టీలోనే బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. బీజేపీతో తెగ‌దెంపులు, కేసీఆర్‌తో ఢీ అంటే ఢీ అన్నారు. జ‌న‌సేన‌తో పొత్తులు దూరం అయ్యాయి. ఒంట‌రి పోరాటం తెలుగుదేశానిది. వైసీపీ ఇటు బీజేపీ ఆశీస్సులు, అటు కేసీఆర్ అండ‌దండ‌లు అందిపుచ్చుకుంది. కోడిక‌త్తి డ్రామా, బాబాయ్ పై గొడ్డ‌లి వేటు వేసి తెలుగుదేశానికి చాలా న‌ష్టం చేశారు. ఇన్ని ప్ర‌తికూల‌త మ‌ధ్య దారుణ ఓట‌మి మూట‌గ‌ట్టుకున్నారు. గెలిచిన 23 మందిలో న‌లుగురిని కొనేశారు వైసీపీ వాళ్లు. మిగిలిన వాళ్లూ త‌మ‌వైపే అంటూ బెదిరింపులు మొద‌లుపెట్టారు. ఒక ఎమ్మెల్యే అయితే ఎక్క‌డున్నారో తెలియ‌నంత మౌనం దాల్చారు. అసెంబ్లీకి వెళ్లి రాక్ష‌సుల‌తో ప్ర‌జాస్వామిక యుద్ధం చేయాల‌నుకున్నారు. కానీ అనైతిక‌, ముష్క‌ర‌, ఫ్యాక్ష‌న్ వైసీపీ చంద్ర‌బాబు నైతిక స్థైర్యం దెబ్బ‌తీసి స‌భ‌కి దూరం చేయాల‌ని ఆయ‌న భార్య‌ని అవ‌మానించారు. జీవితంలో ఎన్ని అవ‌మానాలు ఎదురైనా చెక్కుచెద‌ర‌ని చంద్ర‌బాబు, భోరున ఏడ్చారు. బాబు క‌న్నీరు పెట్టుకున్న దృశ్యాన్ని అవ‌హేళ‌న చేశారు. 23 సీట్లు దేవుని స్క్రిప్ట్ అని ఎద్దేవ చేశారు. పార్టీ కీల‌క‌నేత‌లంద‌రినీ అక్ర‌మ కేసుల్లో ఇరికించి జైలులో వేసేశారు. మాజీ మంత్రులైన‌ అచ్చెన్న‌,అయ్య‌న్న‌, కొల్లు ర‌వీంద్ర‌, నారాయ‌ణల‌ని త‌ప్పుడు కేసుల‌తో హింసించారు.

టిడిపి కేంద్ర కార్యాల‌యంపైనే దాడికి తెగ‌బ‌డ్డారు. చంద్ర‌బాబు ఇంటిపైకి దాడికొచ్చారు. త‌న‌పైనా, త‌న కొడుకుపైనా కేసులు-దాడుల‌కు లెక్కేలేదు. సైకో జ‌గ‌న్ రెడ్డి క్రూర క‌క్ష సాధింపుల‌కు కోడెల శివ‌ప్ర‌సాద్ ని కోల్పోయింది టిడిపి. ఇంత అరాచ‌క అధికార మ‌దంని వైసీపీ ప్ర‌ద‌ర్శిస్తుంటే, తెలుగుదేశం నుంచి ఎదుర్కొనే ప్ర‌క్రియ అంతా ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగానే చేశారంటే చంద్ర‌బాబుకి ఎంత ఓర్పు, ఎంత స‌హ‌న‌మో ఆలోచించుకోవ‌చ్చు. రోడ్డెక్కితే కేసు, నిర‌స‌న కార్య‌క్ర‌మానికి పిలుపు ఇస్తే గృహ‌నిర్బంధాల‌ను దాటుకుని అరాచ‌క స‌ర్కారుపై ఒక్కో అస్త్రాన్ని తీయ‌డం మొద‌లుపెట్టారు. ప్ర‌జ‌ల్లో కూడా ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త తీవ్రం అవ‌డంతో త‌న వ్యూహాల‌కు ప‌దును పెట్టాడు. అప్ర‌తిహ‌త అధికార‌మ‌ద‌మెక్కి ఉన్న వైసీపీకి ప‌ట్ట‌భ‌ద్రుల ఎన్నిక‌ల్లో మాస్ట‌ర్ స్ట్రోక్ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లోనూ 23 మంది ఎమ్మెల్యేలున్న టిడిపి ద‌క్కాల్సిన సీటుపై క‌న్నేశాడు జ‌గ‌న్ రెడ్డి. అక్క‌డే వైసీపీలో ఉన్న వ్య‌తిరేక‌త‌ని వాడుకుని మాజీ మేయ‌ర్, బీసీ మ‌హిళ అయిన పంచుమ‌ర్తి అనూరాధ‌ని రంగంలోకి దింపారు. అనూరాధ గెలుపుని త‌న‌దైన శైలిలో సెల‌బ్రేట్ చేసుకున్న చంద్ర‌బాబు వ్యూహాలు మ‌రింత ప‌దునెక్కుతాయి. చంద్ర‌బాబు చాణ‌క్యం మొద‌లైంది. బాకీలు లెక్క‌లు తేల్చే స‌మ‌యం ఆస‌న్న‌మైంది. సైకోని సాగ‌నంపడం గ్యారెంటీ, అయితే సైకో స్నేహితుల‌కీ రిట‌ర్న్ గిఫ్ట్ బాకీ వ‌డ్డీతో చెల్లించాల్సి ఉంది. ఆ ముచ్చ‌ట తీరే అవ‌కాశాలు క‌న‌ప‌డుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read