ఎన్నికలు ఫలితాల కన్నా ముందే, ఖచ్చితమైన సర్వే ఫలితాలు చెప్పే ఆంద్ర ఆక్టోపస్, లగడపాటి రాజగోపాల్ ని నేడు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. ఈ సమావేశం ఎందుకు జరిగింది అని అడిగితే, అసలు విషయం చెప్పకుండా సీఎం గారు పిలిచారు అందుకే వచ్చానంటూ అమరావతిలో విలేకరులతో చెప్పారు లగడపాటి. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదన్నారు.
అమరావతి వచ్చి ముఖ్యమంత్రిని కలవటం, ఇది రెండో సారి... టీడీపీ లో లగడపాటి చేరతారని, ఎప్పటి నుంచో ప్రచారం ఉంది.. అలాంటి ఆలోచన ఏదీ లేదని ఆయన చెప్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో లగడపాటిని, ముఖ్యమంత్రి స్వయంగా ఆహ్వానించటం, సర్వత్రా చర్చ అయ్యింది... తెలుగుదేశంలో దసరా తరువాత జాయిన్ అవుతారు అనే పుకార్లు వస్తున్నాయి.
మరో వైపు, నంద్యాల, కాకినాడ విజయంతో వచ్చిన ఊపు కొనసాగించడానికి మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఎన్నికలు జరిపితే, పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి, ఓ సర్వే జరపమని లగడపాటిని పిలిచారు అని తెలుగుదేశం వర్గాలు అంటున్నాయి.