గత నెల రోజుల నుంచి చేపల ఎగుమతులు నిలిచిపోవడంతో మత్యకారులు , వ్యాపారులు ఆందోళనలో పడిపోయారు. ఎగుమతులు నిలిచిపోవడానికి కేంద్రంలోని భారతీయ జనతాపార్టీ కారణమనే విమర్శలు వెల్లువెత్తాయి. కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్‌ ఆంధ్రప్రదేశ్‌పై కక్షగట్టి ఆంధ్ర నుంచి చేపలు దిగుమతి చేసుకోరాదని బీజేపీ పాలిత రాష్ట్రాలను కోరినట్లు పెద్దెత్తున దుమారం రేగింది. జాతీయ టెలివిజన్లలో దీనిపై పెద్దెత్తున చర్చ కూడా జరిగింది. మొత్తానికి పరిస్థితులు సద్దుమణిగి సాధారణ పరిస్థితులు ఏర్పడ్డంతో ఇటు చేపలపై ఆధారపడి జీవిస్తున్న మత్యకారులతో పాటు, వ్యాపారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. గత నెల కాలం నుంచి ఒకపక్క ఫార్మాలిన్‌, మరో పక్క లారీల సమ్మె ప్రభావంతోడు కావడంతో చేపల రైతులు, వ్యాపారులు విలవిల్లాడిపోయారు.

cbn 04082018 2

ఎట్టకేలకు మత్స్యశాఖ అధికారులు చేసిన ప్రయత్నాలు, ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖలు ఫలించడంతో గత రెండు మూడు రోజుల నుంచి చేపల ఎగుమతులు మళ్లి ఊపుందుకున్నాయని తిరిగి చేపకు మంచిరోజులు వచ్చాయని మత్స్యకారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాలకు వెళుతున్న ఏపీ రాష్ట్రం చేపల ఎగుమతులకు ఫార్మాలిన్‌ పూత పెద్ద ఎత్తున దెబ్బతీసింది. దీంతో గత నెల రోజులుగా ఎగుమతులు నిలిచిపోయాయి. అస్సోం రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ చేపలను నిషేధించింది. మణిపూర్‌, మేఘాలయ వంటి రాష్ట్రాలు అప్పట్లో తాత్కాలికంగా నిలిపినేసినా తరువాత తనిఖీలు నిర్వహించిన తర్వాత కొంత సరుకు దిగుమతులు చేసుకుంది. అయినప్పటికీ అక్కడి వ్యాపారులు ఆంధ్ర చేపల దిగుమతులను నిషేధించారు. ఎగుమతులు నిలిపి వేయడానికి ప్రధాన కారణం ఫార్మాలిన్‌ రసాయన ప్రభావమని ఈశాన్య రాష్ట్రాల వాళ్లు చేపల ఎగుమతులను నిషేధించారు. దీంతో చేపల మార్కెట్‌ ఒక్కసారిగా స్తంభించింది. చేపల పెట్టుబడులు నిలిచిపోయాయి. ఈ క్రమంలో అస్సోం ప్రభుత్వంతో రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్‌ రమాశంకర్‌ నాయక్‌ ఆధ్వర్యంలో చర్చలు నిర్వహించారు.

cbn 04082018 3

చేపలకు రసాయన పూతలులేవని అధ్యయనం చేసి చెప్పడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. పైగా ఆయా రాష్ట్రాల మత్స్యరంగానికి చెందిన నిపుణులు నేరుగా వచ్చి ఇక్కడ జరుగుతున్న చేపల సాగు పరిశీలించుకోవాలని మత్స్యశాఖ సూచించడంతో నిషేదం తొలగించారు. ఈ నేపథ్యంలో మళ్ళీ ఉత్తరాంధ్ర నుంచి చేపలతో లోడ్‌లు వెళ్లినట్లు వ్యాపారులు చెబుతున్నారు. అయితే ఈ సమస్య నుంచి త్వరగానే బయటపడ్డామని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అది కాకుండా ధరలు తగ్గుముఖం పట్టకపోవడంతో రైతులు మరింత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మన రాష్ట్రంలోని ఆకివీడు, కైకలూరు, భీమవరం కేంద్రాలుగా ప్రతిరోజు 200 లారీల వరకు చేపల సరుకు ఎగుమతి అవుతోంది. సీజన్‌లో అయితే మరో 100 లారీలు ఈ ప్రాంతాల నుంచి అదనంగా ఎగుమతులు చేస్తుంటారని తెలుస్తోంది. గత 35 ఏళ్ళుగా పశ్చిమ బెంగాల్‌, బీహార్‌ , ఉత్తరప్రదేశ్‌లతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు మన రాష్ట్రం లో పండే చేపలు ఎగుమతులు జరుగుతున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read