విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్, రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో, అంత లేట్ అవుతుంది... ఈ ప్రాజెక్ట్ ఎన్ని రోజులు నుంచి జాప్యం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం... ఎవరైనా ఈ జాప్యానికి మొదట నిందించేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని... కాని, వాస్తవ పరిస్థితి మాత్రం వేరు... కేంద్రం రకరకాలుగా ఈ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ఇబ్బంది పెడుతుంది... నేషనల్ హై వే మీద నిర్మిస్తున్న ఈ ఫ్లై ఓవర్, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టిన ప్రాజెక్టు.... కేంద్రం 75 శాతం నిధులు సమకూర్చాల్సి ఉండగా, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్చి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాకు మించి నిధులు వెచ్చించినా కేంద్రం మాత్రం నిధులు అందించడంలేదు. దీంతో అసలకే దారుణంగా నడుస్తున్న ప్రాజెక్ట్, మరింత జాప్యం అవుతోంది. మరోవైపు డీవియేషన్లు (మార్పులు, చేర్పులను) కూడా కేంద్రం అంగీకరించక పోవటంతో ఢిల్లీ నుంచి అమరావతికి ఫైల్స్ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు పేరు కేంద్రానికి... ఊరు రాష్ట్రానికి అన్నట్లు తయారైంది... రూ. కోట్ల వెచ్చిస్తున్నా, అది కేంద్ర ప్రాజెక్టు ఖాతాలోకి వెళ్లింది.
పూర్తయిన పనులకూ నిధుల విడుదలలో కేంద్రం కొర్రీలు పెడుతుండటాన్ని సాకుగా చూపి నిర్మాణ సంస్థ పనులను నత్తనడకన నడిపిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవానికి నిర్మాణ సంస్థకు ఇచ్చిన గడువు 2016 డిసెంబరులోనే పూర్తికావడంతో 2017 జూన్ వరకు గడువు పొడిగించాలని నిర్మాణ సంస్థ కోరింది. దీనిపై మీనమేషాలు లెక్కిం చిన కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహ దారుల మంత్రిత్వ శాఖ చాలా రోజుల అనం తరం నిర్ణయం తీసు కుంది. ఈ గడువు కూడా పూర్తికావడంతో రెండోసారి 2018 మార్చి 31 వరకు పొడి గించా లని నిర్మాణ సంస్థ కోరింది. ఈ మేరకు గత ఏడాది ఆగస్టులో కేంద్రానికి లేఖ రాసింది. దీనిపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలాగని నిర్మాణ సంస్థపై చర్యలూ తీసుకోవడం లేదు. కేంద్రం అనుసరిస్తున్న ధోరణి కాంట్రాక్టు సంస్థకు వరంగా మారింది.
దుర్గగుడి ఫ్లైఓవర్ ఒప్పందాన్ని నుసరించి.. పిల్లర్లు(స్తంభాలు), పిల్లర్ల నడుమ స్పైన్లను అమర్చిన తర్వాత 30 శాతం బిల్లును, స్పైన్లకు వింగ్స్‌ను అమరిస్తే మిగిలిన 70 శాతం బిల్లును చెల్లించాల్సి ఉంది. వాస్తవానికి పిల్లర్లు, స్పైన్ల అమరికకు ఎక్కువ మొత్తం ఖర్చు అవుతుందని, దానికి తక్కువ మొత్తాన్ని మంజూరు చేయడం వల్ల ప్లైఓవర్ పనుల వేగం మందగిస్తోందని ఈ పనులను పర్యవేక్షిస్తున్న ఆర్ అండ్ బీ అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. స్పైన్ల అమరిక పూర్తయిన మేరకు కొంత మొత్తం బిల్లు విడుదలయ్యేలా చూస్తే నిర్మాణ పనులు పుంజుకునే అవకాశం ఉందని వివరించారు. గతంలో ఇదే తరహాలో నిర్మాణం జరుపుకున్న ముంబై సహర్ రోడ్ ఎలివేటెడ్ హైవే, ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డు ఫైఓవర్కు సైతం బిల్లుల చెల్లింపుల్లో సవరణలు జరిగాయని వారు సీఎంకు వివరించారు.
అధికారుల ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈమేరకు నిధుల విడుదల చేసే అంశాన్ని పరిశీలించాలని, సానుకూలంగా స్పందిస్తే ఫ్లైఓవర్ పనులు పుంజుకునే అవకాశం ఉందని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ(ఎంఓఆర్టీహెచ్-మోర్త్)కు లేఖ రాశారు. 2017 తొలి అర్ధభాగంలో ఓ లేఖ, అక్టోబరు 17న మరో లేఖ రాశారు. అదే సమయంలో ఈ ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పలుమార్లు మోర్త్ అధికారులతో చర్చలు జరిపారు. ఈ ప్రతిపాదనలపై తగిన నిర్ణయం తీసుకోకుండా విపరీతమైన జాప్యం చేసిన మోర్త్ ఎట్టకేలకు ఈ ఏడాది మార్చి 7న రాష్ట్రానికి ఓ లేఖ రాసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదలన్నింటినీ తిరస్కరిస్తున్నామని అందులో స్పష్టం చేసింది.