పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభంలోపే కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు వ్యూహ రచన చేస్తోంది తెలుగుదేశం పార్టీ. జులై 18 నుంచి ఆగస్టు 10 వరకు మాన్‌సూన్‌ సెషన్స్‌ జరగనున్నాయి. మొత్తం 18 రోజుల పాటు సాగనున్న సమావేశాల్లో ఏపీకి చెందిన పార్టీల నేతలు ప్రత్యేక హోదాతో పాటు విభజన చట్టంలోని హామీలపై ప్రభుత్వాన్ని నిలదీయనున్నారు. కేంద్రంపై మరోసారి అవిశ్వాసం పెట్టేందుకు సైతం టీడీపీ సమాయత్తం అవుతోంది. అందులోభాగంగా ప్రత్యేక హోదాపై దేశంలోని బీజేపీ, కాంగ్రెస్సేతర పార్టీలకు సీఎం చంద్రబాబు లేఖలు రాశారు. ఎన్డీయే ప్రభుత్వంపై టీడీపీ పెట్టిన అవిశ్వాసానికి మద్దతివ్వాలని కోరారు. విభజన హామీలు వివరించారు. గత సమావేశాల్లో అవిశ్వాసం పెట్టినా చర్చకు రానీయలేదని బాబు పేర్కొన్నారు. 8 పేజీలతో లేఖలో విభజన హామీలు, ఇప్పటివరకు చేసిన పనులు, చేయాల్సిన పనులను చంద్రబాబు పొందుపర్చారు.

cbnletter 15072018 2

ఇదే అంశంపై టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, కొనకళ్ల నారాయణ.. టీఆర్ఎస్ ఎంపీ కేశవరావును ఆదివారం మధ్యాహ్నం కలిశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి చేసిన వాగ్ధానాలు పూర్తిగా నెరవేర్చలేదని, ప్రత్యేకహోదా ఇస్తామని మోసం చేసిందని, ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయాన్ని ఎంపీలు వివరించారు. ఈ విషయంలో తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. అలాగే డీఎంకే, అన్నాడీఎంకే నేతలను కూడా టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కలవనున్నారు. మరోవైపు శివసేన అధినేత ఉద్దవ్‌ థాకరేను టీడీపీ ఎంపీలు కలవాలని అనుకున్నారు. అనివార్యకారణాల రీత్యా వీరి పర్యటన రద్దు అయింది. ప్రస్తుతం ఉద్దవ్‌ థాకరే ముంబైలో లేరు. అందువల్ల వీరి పర్యటనకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. సోమవారం లేదా మంగళవారం ఆయన్ను టీడీపీ ఎంపీలు కలిసే అవకాశం ఉంది.

cbnletter 15072018 3

విభజన హామీలపై బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఉన్నఅన్ని అవకాశాలనూ పరిశీలిస్తోంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ ఎన్నికలో.. జాతీయ స్థాయిలో విపక్షాలను ఏకతాటిపైకి తెచ్చేందుకు మరోసారి టీడీపీ అధినేత సమాయత్తం అవుతున్నారు. ఢిల్లీలోనూ ఉద్యమ వేడిని రగిలించేందుకు టీడీపీ వ్యూహం రచిస్తోంది. హక్కుల సాధనకోసం దీక్షలు చేస్తూనే.. రాష్ట్రానికి చేసిన అన్యాయంపై కేంద్రాన్ని ఇరుకున పెట్టాలని యోచిస్తున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల తొలిరోజే మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతూ స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని అమరావతిలో గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెదేపా పార్లమెంటరీ పార్టీ కూడా నిర్ణయించింది.

Advertisements

Advertisements

Latest Articles

Most Read