బిహార్‌ సీఎం నితీష్‌‌కుమార్‌కి ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి బిహార్‌కి చేపలు, రొయ్యల ఎగుమతులను పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. సముద్ర ఉత్పత్తులను నిల్వ ఉంచేందుకు ఫార్మాలిన్‌ వాడుతున్నారన్న ఆరోపణలతో ఎగుమతులు నిలిపివేశారని లేఖలో చంద్రబాబు వివరించారు. ప్రభుత్వ తనిఖీల్లో ఫార్మాలిన్‌ వాడటం లేదని తేలిందని స్పష్టం చేశారు. టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. అవసరమైతే బిహార్‌ నుంచి అధికారుల బృందాన్ని పంపించి తనిఖీ చేసుకోవచ్చని సూచించారు. వెంటనే ఎగుమతులను పునరుద్ధరించాలని నితీష్‌కుమార్‌ను చంద్రబాబు కోరారు.

bihar cm 21012019

అసలు ఏమి జరిగింది ?దేశం నలుమూలలకు ఎగుమతవుతున్న ఏపీ చేపల్లో ప్రమాదకర ‘ఫార్మాలిన్‌’ అవశేషాలున్నాయని ప్రచారం ఎందుకు జరిగింది? 1976 నుంచి ఏపీ చేపలు ఎగుమతి అవుతున్నాయి. పకడ్బందీగా ప్యాకింగ్‌ చేసి పంపుతున్న చేపలపై ఫార్మాలిన్‌ పూత పూస్తున్నామన్న అపవాదు ఎలావచ్చింది? మన చేపల అమ్మకాన్ని ఆ ఐదు రాష్ట్రాలు ఎందుకు నిరాకరించాయి. ఇదీ ఏపీ ప్రభుత్వ అధికారులు, చేపల ఉత్పత్తి, ఎగుమతిదారుల్లో నెలకొన్న సందేహం. ఏపీ చేపల దిగుమతుల నిషేధం వెనుక రాజకీయ కుట్ర ఉందన్న వాదనకు బలం చేకూరుతోంది. ఏపీ చేపల పై అభ్యంతరాలు రావడం వెనుక మర్మం ఏమిటనే కోణం లో పరిశీలిస్తే.. రాజకీయ కుట్రే కారణమని అధికార వర్గాలు అంటున్నాయి.

bihar cm 21012019

ఏపీ చేపలపై ప్రమాదకర రసాయన పూతలు ఏమీ పూయట్లేదని భరోసా ఇస్తూ, ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏపీ సీఎం చంద్రబాబు లేఖ రాయడంతో మూడు రాష్ట్రాలు మెత్తబడ్డాయి. అయినా నాగాలాండ్‌ మాత్రం భీష్మించింది. వ్యవసాయ ఉత్పత్తుల్లో నాణ్యతకు పెద్ద పీట వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా సాగులోనూ యాంటీబయోటిక్స్‌ వినియోగంపై నిషేధం అమలు చేస్తున్నది. అయినా రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేందుకే ఫార్మాలిన్‌ పేరిట దుష్ప్రచారంతో కొన్ని రాష్ట్రాల్లో మన చేపలపై నిషేధం విధించారన్న సందేహం మన అధికారుల్లో ఏర్పడింది. మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు రోజూ మన చేపలు 52 ట్రక్కుల్లో వెళ్తాయి. అలాగే పశ్చిమబెంగాల్‌కు 150, ఒడిసాకు 30, బిహార్‌కు 50 యూపీకి 30, ఢిల్లీ+పంజాబ్‌లకు 20, ముంబైకి ప్రత్యేకంగా 6 ట్రక్కులు వెళ్తున్నాయి.

Advertisements

Advertisements

Latest Articles

Most Read