ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. నవంబర్ 29న పాకిస్తాన్‌లో బందీలైన శ్రీకాకుళం జిల్లాకు చెందిన మత్స్యకారులను విడిపించాలని రాజ్‌నాథ్‌, సుష్మాస్వరాజ్‌కు చంద్రబాబు లేఖలు రాశారు. పొట్టకూటి కోసం గుజరాత్ వెళ్లి పాకిస్తాన్ చెరలో చిక్కుకున్నారని మత్స్యకారులను విడిపించాలని చంద్రబాబు లేఖలో కోరారు. 22 మంది మత్స్యకారులకు చెందిన 11 కుటుంబాలకు ప్రభుత్వ సాయం చేస్తుందని ఈ సందర్భంగా బాబు స్పష్టం చేశారు. సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో నవ్యాంధ్ర హైకోర్టు ఏర్పాటు చేయడం జరిగింది. తాత్కాలిక హైకోర్టును ప్రారంభించిన అనంతరం కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

cbn 01012019 2

పాకిస్తాన్‌ నేవీ అదుపులో ఉన్న 24 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మంత్రి కళా వెంకట్రావు విజ్ఞప్తితో కుటుంబానికి రూ. 2 లక్షలు ఇవ్వాలని నిర్ణయించారు. జాలర్లను విడిపించేందుకు చర్యలు చేపట్టాలని చంద్రబాబు ఆదేశించారు. పట్టుబడిన జాలర్లది శ్రీకాకుళం, విజయనగరం, తూ.గో జిల్లాల వారు. గుజరాత్ వద్ద సరిహద్దు దాటారని ఆరోపిస్తూ చేపట వేటకు వెళ్లిన 24 మంది ఏపీ జాలర్లను పాకిస్థాన్ కోస్ట్ గార్డు అధికారులు గత నెలలో అదుపులోకి తీసుకున్నారు. పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న శ్రీకాకుళం మత్స్యకారులపై భారత ఎంబసీ స్పందించింది.

cbn 01012019 3

ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ స్వీకరించింది. ఏపీ ప్రభుత్వ ఆందోళనను భారత హైకమిషన్.. పాకిస్థాన్ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లింది. నిర్బంధించిన మత్స్యకారులను కరాచీ పంపినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ విదేశాంగ అధికారులతో భారత ఎంబసీ అధికారి గౌరవ్ అహ్లువాలియా సంప్రదింపులు జరుపుతున్నారు. ఏపీ ప్రభుత్వానికి పూర్తి తోడ్పాటు ఇస్తామని భారత ఎంబసీ అధికారుల హామీ ఇచ్చారు. ఈ మేరకు ఢిల్లీలోని ఏపీ భవన్‌కు కమిషనర్ అర్జా శ్రీకాంత్‌కు సమాచారం అందించారు. ఢిల్లీలో ఏపీ భవన్ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. పాకిస్థాన్ నిర్బంధంలో ఉన్న మత్స్యకారుల యోగక్షేమాలపై ఆరా తీశారు. మత్స్యకారులంతా సురక్షితంగా రాష్ట్రానికి వచ్చేలా చూడాలని సూచించారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read