ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదుపు తప్పుతున్న పరిస్థితులు, గత కొన్ని రోజులుగా వరుసగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, ప్రభుత్వ వైఖరి, ఇవన్నీ తెలియ చేస్తూ వివరంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు, తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పక్షం టోటల్ గా ఫెయిల్ అయ్యిందని, గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇష్టం వాచినట్టు ప్రవర్తిస్తున్నారని అన్నారు. వీళ్ళు చేసే ప్రతి పనికి పోలీసులు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. పోలీసులు కూడా రక్షణ ఇవ్వలేక పోవటంతో, రాష్ట్రంలో ప్రజలకు, వారి ఆస్తులకు బధ్రత అనేది లేకుండా పోయిందని అన్నారు. ముఖ్యంగా ఈ అరాచకాలు అన్నీ, వైసీపీ ప్రజా ప్రతినిధులే చేయటం, మరో అంశం అని అన్నారు. తాడిపత్రిలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసి లేని టైంలో ఆయన ఇంటికి వెళ్ళటం, అక్కడ చేసిన హడావిడి, ఆయనే దగ్గరుండి ఈపనులు చేయటం ప్రజలందరూ చూసారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టపగులు ఇలా రేచ్చిపోయారని, సిసి టీవీ ఫూటేజ్ కూడా అందరూ చూసారని, అయినా పోలీసులు ముందుగా, వారి పైన కేసు పెట్టకుండా, బాధితులైన వారి పై కేసులు పెట్టి వేదిస్తున్నారంటే, ప్రభుత్వం, ప్రతిపక్షాలను ఎలా వేదిస్తుందో అర్ధం అవుతుందని అన్నారు.

governor 311220201 2

అలాగే వైసిపీ ఎమ్మెల్యేలు బహిరంగంగా రెచ్చిపోతున్నారని, ఎమ్మెల్యే పెద్దారెడ్డి, బహిరంగంగా టీవీ ఛానల్ లో చూసుకుందాం రండి, ఎవరో ఒక్కరే మిగలాలి అని చెప్పటం చూస్తుంటే, వీళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏమి చేయాలని అనుకుంటున్నారని ప్రశ్నించారు. ఇంతిదిగా ప్రతిపక్ష నేతలకు, అధికార పక్ష నేతలు వార్నింగ్ ఇస్తుంటే, పోలీసులు చూస్తూ ఉన్నారంటే, అర్ధం ఏంటి అని అన్నారు. పోలీసులే సహకరిస్తున్నారా అనే అనుమానం వస్తుందని అన్నారు. అధికార పక్షం నేతలే ఇలా బహిరంగంగా రెచ్చిపోతుంటే, రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అన్నారు. రాష్ట్రంలో చట్టాలు అమలు కావటం లేదని, రూల్ అఫ్ లా అనేది లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలో పరిస్థితి చేయదాటక ముందే, మీరు జోక్యం చేసుకుని, ప్రజాస్వామ్యాన్ని రక్షించి, రూల్ అఫ్ లాని కాపాడండి, ప్రజలకు ఈ వ్యవస్థల మీద నమ్మకం పెంచేలా చేయండి అంటూ చంద్రబాబు గవర్నర్ ను కోరారు. అలాగే ఎమ్మెల్యే పెద్దారెడ్డి, జేసి ఇంటికి వెళ్ళిన ఫూటేజ్, ఎవరో ఒకరే మిగులుతారు, రండి తేల్చుకుందాం అని చెప్పే వీడియో, ఈ రెండు వీడియోలను గవర్నర్ కు పంపించి, ఎమ్మెల్యే పై తగు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు, గవర్నర్ ను కోరారు.

 

Advertisements

Advertisements

Latest Articles

Most Read