ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, సుదీర్ఘ కాలం తరువాత, ప్రధాని మోడీతో భేటీ కానున్న సంగతి తెలిసిందే... ఈ నెల 12న మొదట అనుకున్నా, సంక్రాంతి పండుగ హడావిడి నేపధ్యలో, భేటీ 17వ తేదీకి వాయిదా పడింది... అయితే ఈ లోపు ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది... ప్రధానితో భేటీకి ముందే చంద్రబాబు అన్ని విషయాల మీద క్లారిటీ తీసుకుంటున్నారు... ఈ నేపధ్యంలో కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీకి చంద్రబాబు లేఖ రాసారు... ప్రత్యేక ప్యాకేజీ, ఈఏపీ కింద రాష్ట్రానికి కేటాయించాల్సిన నిధుల గురించి లేఖలో ఆయన పేర్కొన్నారు.

modi 10012018 2

ఈఏపీ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదనలు ఆర్థిక శాఖలో పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టుల ఆమోదంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రాజెక్టులు వెంటనే ఆమోదం పొందేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఆరు ప్రాజెక్టులకు నాబార్డు ద్వారా రూ.16725 కోట్లు ఇవ్వాలని, రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవనాల నిర్మాణానికి రూ.3341 కోట్లు.. అమరావతి గ్రీనింగ్ డెవలప్‌మెంట్‌కు రూ.1484 కోట్లు.. గ్రామాల నుంచి మండల కేంద్రాలకు రోడ్ల నిర్మాణానికి 3200 కోట్లు.. వెనుకబడిన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.1000 కోట్లు.. రహదారులు, వంతెనల నిర్మాణానికి రూ.3200 కోట్లు.. పట్టణ నీటి సరఫరాకు రూ.4500 కోట్లు ఇవ్వాలని చంద్రబాబు లేఖలో కోరారు.

modi 10012018 3

అయితే ఇవన్నీ చంద్రబాబు వ్యూహాత్మకంగా చేస్తున్నారు... ప్రధానితో భేటీకి ముందే కేంద్రానికి అన్ని విషయాల పై క్లారిటీ ఇస్తున్నారు... మీరు మాకు ఇది ఇస్తాం అన్నారు, ఇప్పటి వరకు ఇవ్వలేదు అని చెప్తున్నారు... అలాగే ఇప్పటికే పోలవరం పై, రైల్వే ప్రాజెక్ట్ ల పై కూడా కేంద్రానికి క్లారిటీ ఇచ్చారు... ఇప్పుడు ఇవన్నీ తీసుకుని ప్రధాని ముందు పెట్టనున్నారు చంద్రబాబు... ప్రధానితో భేటికి ముందే అన్ని విషయాలు కేంద్రానికి చెప్తే, ప్రధాని కార్యాలయానికి కూడా సంపూర్ణ సమాచారం ఉంటుంది అని, తద్వారా ప్రధానితో మీటింగ్ సమయంలో అన్ని విషయాల మీద అవగాహనతో ఉంటారు అనేది చంద్రబాబు ఆలోచనగా ఉంది.. ముఖ్యమంత్రి కృషి ఎంత వరకు ఫలిస్తుందో, కేంద్రం ఎంత వరకు సహకరిస్తుందో చూడాలి...

Advertisements

Advertisements

Latest Articles

Most Read