ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రధాని నరేంద్ర మోడీకి లెటర్ రాసారు... ఢిల్లీ పర్యటనకు వెళ్ళే ముందు, ఈ లెటర్ రాసారు... దేశంలో రావణ కాష్టంగా మారిన, స్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల పై, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై గత నెల 20న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పునస్సమీక్షించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఓ లేఖ రాశారు. కాగా, ఎస్టీ, ఎస్టీ చట్ట సవరణ ఉత్తర్వుపై సుప్రీం కోర్టులో కేంద్రం వేసే రివ్యూ పిటిషన్‌కు అనుబంధంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయపోరాటం చేస్తుందని మంత్రి నక్కా ఆనందబాబు చెప్పారు.
సచివాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు... రాజ్యాంగ పితామహుడు బీఆర్ అంబేద్కర్ ఉన్నత ఆశయంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టును రూపొందించారన్నారు. ఈ యాక్టు వల్ల ఎస్సీ, ఎస్టీల మాన, ప్రాణ, ఆస్తికి ఎంతో రక్షణ లభిస్తోందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టంలోని కొన్ని నిబంధనలను సడలిస్తూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు వల్ల దళితులు, గిరిజనుల్లో అభద్రతా భావం నెలకొందన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఇంప్లీడ్ పిటీషన్ వేయాలని చంద్రబాబు నాయుడు నిర్ణయించారని నక్కా ఆనందబాబు అన్నారు. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్ సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర ప్రభుత్వం తరఫున కూడా రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారన్నారు.
ఈ సందర్భంగా, జగన్ మోహన్ రెడ్డి చర్యలను కూడా తప్పు బట్టారు.. ఎస్సీ, ఎస్టీ చట్టం స్ఫూర్తిని దెబ్బతీసేలా చంద్రబాబు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రతిపక్ష నేత జగన్, రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాయడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు. ఇడుపులపాయలో 600 ఎకరాల దళితుల అసైన్డ్ భూములను వైఎస్ ఎస్టేట్ ఆక్రమించినట్లు టీడీపీ పక్ష ఉపనేతగా అశోక్‌గజపతిరాజు కోర్టులో పిటిషన్ వేయగా, దళితుల భూములను వెనక్కి ఇచ్చేస్తామని తర్వాత అసెంబ్లీలో వైఎస్ ప్రకటించిన విషయాన్ని జగన్ గుర్తించాలన్నారు. అయినా.. ఇంత వరకు దళితులకు ఆ భూములు వెనక్కి ఇచ్చిన దాఖలా లేదన్నారు. దళితుల భూముల్ని ఆక్రమించిన జగన్ కుటుంబం దళిత జాతికి క్షమాపణ చెప్పాలన్నారు.