ఆస్తులు కన్నా, చదువే ముఖ్యం... పిల్లలకు ఆస్తుల కంటే, చదువునందిస్తే వారే అన్నీ సంపాదించుకుంటారు.... ర్యాంకులు మీరు తెచ్చుకోండి.. చదువు మేం చెప్పిస్తాం... ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు అయినా ఇలా చెప్పటం విన్నారా ? ఏ స్టేజి మీద అయినా, సందర్భం ఏదైనా, పిల్లల్ని బాగా చదివించండి అనే నాయకులు ఎంత మంది ? విద్యార్థుల్లో విషబీజాలు నాటి, వారిని రాజకీయంగా వాడుకుంటున్న నాయకులకి, వారి బంగారు భవితకు భరోసా కల్పించే చంద్రబాబుకి ఇది తేడా... ఎందుకు ఈయనకు చదువు అంటే అంత పిచ్చి ?

cbn students 04052018 2

1995లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణస్వీకారం చేసినప్పుడు, ఇంజనీరింగ్ కోర్స్ చెయ్యాలి అంటే, అది ఒక కల... అలాంటిది ప్రణాలికాబద్ధంగా ఇంజనీరింగ్ కాలేజీలు పెంచి, పల్లెటూరుల్లో ఉన్నవారికి కూడా, ఇంజనీరింగ్ కోర్స్ దగ్గర చేశారు. దాని ఫలితమే, పల్లెటూరులు నుంచి కూడా వెళ్లి ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నారు... దాని ఫలతమే, వ్యవసాయం చెయ్యటం మాత్రమే తెలిసిన చేతులు, కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగాలు చేసేలా చేసాయి... ఇప్పుడు చంద్రబాబు నవ్యాంధ్రకు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా, చదువుకి అధిక ప్రాధ్యానత ఇస్తున్నారు.. రాష్ట్రంలో 26 లక్షల మంది విద్యార్ధులు వివిధ పథకాల పరిధిలో ప్రభుత్వ సహకారంతో చదువుకుంటున్నారు. అంతే కాదు, విదేశాల్లో చదువుకోవాలని కలలుకంటూ, పేదరికం అడ్డు వచ్చి చదువుకోని వారికి కూడా, స్కాలర్షిప్ ఇచ్చి విదేశాల్లో చదివిస్తున్నారు. అలాగే, ఐఏఎస్ శిక్షణ కోసం దేశంలోని ఉత్తమ 40 కోచింగ్ సెంటర్లను గుర్తించి, శిక్షణ ఇప్పిస్తున్నారు. వాటిలో శిక్షణ కోసం ఒక్కొక్కరికీ రూ.2 50 లక్షలు ఖర్చవుతుంది, దానిని ప్రభుత్వమే భరిస్తూ పేద విద్యార్ధులకు అండగా నిలబడుతుంది.

cbn students 04052018 3

గత కొన్ని రోజులుగా, మనం చూస్తున్నాం.. ఆయనకు ఎన్ని పనులు ఉన్నా, రోజు కొంత మంది పిల్లలను సచివాలయానికి పిలిచి, వారి ప్రతిభను గుర్తించి, వారిని అభినదిస్తున్నారు.. ఎస్సీ, ఎస్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదివి, ఐఐటీ-జేఈఈ, పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్ధులను పిలిచి అభినందిచారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పాఠశాలలో 10 వ తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపించిన విద్యార్ధులని, పిలిచి అభినందించారు.. సివిల్ సర్వీసెస్ పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు సాధించిన, మన విద్యార్ధులని అభినందించారు. ఇలా రోజుకు కొంత మంది విధ్యార్ధులను పిలిచి, వారికి భరోసా ఇచ్చి, కాన్ఫిడెన్సు నింపుతున్నారు. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల పై, సామాన్య ప్రజల్లో భరోసా నింపుతున్నారు..

అందరి తిల్లిదంద్రులకి ఒకే ఆశ, ఒకే కల ఉంటుంది... తమ పిల్లల బాగా చదువుకుని ప్రయోజికులు కావాలాని... దాని కోసం ఆస్తులు అమ్ముతారు, కష్టపడతారు... కాని ఎంత చేసినా, చాలా మంది ఆ కల నేరవేర్చుకోలేరు... ఇలాంటి వారి కలలు జయప్రదం చేయడం ద్వారా వారి జీవితాల్లో సంతోషాన్ని నింపడమే చంద్రబాబు లక్ష్యం. పేద పిల్లలు బాగా చదువుకుని వాళ్ల కాళ్లమీద వాళ్లు జీవితంలో స్థిరపడి, తిరిగి సమాజానికి ఉపయోగపడాలి, ఇది చంద్రబాబు విజిన్... ప్రపంచమంతా అధ్యయనం చేసి ఎక్కడెక్కడ మంచి విద్యాలయాలున్నాయో, ఆన్నింటిలోనూ రాష్ట్ర విద్యార్ధులు చదువుకునేలా ఏర్పాట్ల చేస్తున్నారు... చదువుకు ఆటంకం కాకుండా, పేదరికం అడ్డు కాకుండా ఎన్నో పథకాలను రూపొందించారు...

చంద్రబాబు అందరి రాజకీయ నాయకులులాగా కాదు... అయన ఏ పని చేసినా ఒక విజన్ ఉంటుంది... ఈ పిల్లల మీద పెట్టే ఖర్చు, ప్రజలను మభ్య పెట్టటానికి ఏవో పిచ్చి పధకాలు పెట్టి, వాళ్ళని ఆకట్టుకోవచ్చు... కాని చంద్రబాబు, పిల్లలకు బంగారు భవిషత్తు, చదువుతోనే వస్తుంది అని నమ్ముతారు. వీళ్ళకు మంచి జీవితాలిస్తే చాలు , వాళ్ళు సమాజం మొత్తాన్ని మార్చేస్తారు అని నమ్ముతారు. వాళ్ళ చిరునవ్వులతో మనం ఖచ్చితంగా రేపు ఆనందకరమైన సమాజాన్ని చూస్తాం అని నమ్మి, వారికి అండగా నిలబడతారు. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి... ఎవరో ఒకరు గెలుస్తుంటారు, కానీ సమాజాన్ని నిర్మించాల్సిన బాధ్యత తీసుకోగలిగేదే నిజమైన ప్రభుత్వం.. వారే నిజమైన నాయకలు.... ఆ నాయకుడే మన చంద్రబాబు...

Advertisements

Advertisements

Latest Articles

Most Read