ఈ నెల 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో, కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. అక్టోబర్ నెలలో ఎన్నికలకు వెళ్తున్న మోడీ ప్రభుత్వానికి, ఇవే చివరి ఎన్నికలు కానున్నాయి. అందుకే, ఈ సమావేశంలో అన్ని విషయాల పై, పై చేయి సాధించటానికి, మోడీ, అమిత్ షా ప్లాన్ చేసారు. పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో, తెలుగుదేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానం పై చర్చించే దమ్ము లేక, వాయిదాలు వేసుకుని పారిపోయారు. ఒక్క రోజు కూడా, పార్లమెంట్ సమావేశాలు జరగ లేదు. అయితే, ఈ సారి కూడా మోడీ పై అవిశ్వాస తీర్మానం పెట్టటానికి, తెలుగుదేశం రెడీ అవుతుంది. విభజన హామీలు, ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్ కు జరుగుతున్న అన్యాయం, ఇలా అన్ని విషయాల పై మోడీ ప్రభుత్వాన్ని కడిగేయటానికి రెడీ అయ్యింది.

modicbn 08072018 2

ఇదే సందర్భంలో, అమిత్ షా , మోడీ కూడా, ఈ విషయంలో డిఫెన్సు లో పడకుండా, ఈ సారి, ఈ చర్చ తీసుకురావటానికి రెడీ అవుతున్నారు. అన్నీ ఇచ్చేసాం అని బయట చెప్పినట్టు, ఇక్కడ చెప్తే కుదరదు. అందుకే, మరోసారి ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నంలో, రెండు నెలల్లో చేస్తాం, మూడు నెలల్లో చేస్తాం, కమిటీ వేస్తాం అంటూ చెప్పి, ఇన్నాళ్ళు చేయ్యకపోవటానికి కారణం, చంద్రబాబే అనే రాజకీయ దాడికి ప్లాన్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో, పార్లమెంట్, రాజ్యసభాల్లో తెలుగుదేశం ఎంపీలకు కౌంటర్ ఇచ్చే అవకాసం లేకుండా, ప్లాన్ లు వేసారు. ఇదే సందర్భంలో, తెలుగుదేశం ఎంపీలు, మోడీ ముందుకు వచ్చి నిరసన తెలిపే అవకాసం లేకుండా కూడా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా ఎదో ఒకటి చేసి, ఈ చర్చ ముగించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ..

modicbn 08072018 3

అయితే, ఇవన్నీ గ్రహించిన చంద్రబాబు, దీనికి కౌంటర్ వ్యూహం సిద్ధం చేసారు. కేంద్రం తన వాదనను సమర్ధించుకోవడానికి వన్‌సైడ్‌గా ప్రకటనలుండడం ఖాయం. లోక్‌సభలో తిప్పికొట్టడానికి ఎంపీలకు అవకాశం ఇవ్వరు. బయట కేంద్రం అబద్ధాలు చెబుతోందని ఎంతగా మొత్తుకున్న అవి రాజకీయ ప్రకటనల్లాగానే ఉంటాయి. అందుకే చంద్రబాబు వినూత్నంగా ఆలోచించారు. కేంద్రం పార్లమెంట్‌లో చేసే ప్రకటనలకు అసెంబ్లీ వేదికగా సమాధానాలివ్వాలని భావిస్తున్నారు. అప్పడైతేనే అధికారికంగా సమాధాలిచ్చినట్టు అవుతుందని ఏపీ ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పార్లమెంట్ జరుగుతున్న సమయంలోనే అసెంబ్లీ సమావేశపర్చటానికి రెడీ అయ్యారు. తెలుగుదేశం, మోడీ చేస్తున్న ద్రోహాన్ని ఇలా ఎదుర్కుంటుంటే, జగన్, పవన్ మాత్రం, చంద్రబాబు నామస్మరణలో మునిగి తేలుతున్నారు.

Advertisements

Advertisements

Latest Articles

Most Read