పోలవరం పై కేంద్రం పెడుతున్న ఇబ్బందులు తెలిసినవే... ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్ అనుకున్నంత మేర పనులు చెయ్యటం లేదని భావించి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే 60-సీ కింద నోటీసులు ఇచ్చింది. ఆ పనులను వేరే సంస్థకు అప్పగించేందుకు వీలుగా టెండర్లను పిలిచింది. కానీ, ఆ టెండర్లను కేంద్రం నిలిపివేసింది. కొత్త టెండర్లు పిలిస్తే అదనపు భారం పడుతుంది అంటూ ముందుకు వెళ్ళనివ్వ లేదు... వారం క్రిందట మౌఖికంగా కొత్త టెండర్లకు ఆదేశాలు ఇచ్చినా, ఇప్పటి వరకు రాత పూర్వకంగా ఆదేశాలు రాలేదు.. ఇవన్నీ ఎందుకు అనుకున్నారో ఏమో, చంద్రబాబు మాష్టర్ ప్లాన్ వేసారు... కేంద్రం ఎత్తుకి, చంద్రబాబు పై ఎత్తు వేశారు..
అటు కేంద్రానికి ఇబ్బంది లేకుండా, ఇటు ప్రధాన కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌స్ట్రాయ్ కి ఇబ్బంది లేకుండా చంద్రబాబు అద్భుతమైన ఐడియా వేసారు... పోలవరం ప్రాజెక్టు కాంక్రీటు పనులు పరుగులు తీయడమే లక్ష్యంగా అదనంగా ఆర్థిక భారం పడకుండా, రాష్ట్ర ప్రభుత్వ ఆందోళనను దూరం చేసేలా కీలక నిర్ణయం తీసుకున్నారు... పోలవరం స్పిల్ వే, స్పిల్ చానల్ కాంక్రీట్ పనులు చేపట్టేందుకు ‘నవయుగ’ సంస్థను ముందుకు తెచ్చారు చంద్రబాబు... నవయుగ, ట్రాన్స్‌స్ట్రాయ్‌తో కలసి ఈ పనులు చేపట్టేందుకు అంగీకరించింది.
అటు ట్రాన్స్‌స్ట్రాయ్ కూడా నవయుగతో కలిసి పని చేసేందుకు అంగీకరించింది. బుధవారం రాష్ట్ర ప్రభుత్వంతో నవయుగ సంస్థ చర్చలు జరిపింది. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, లాభాలను ఆశించకుండా... గతంలో ట్రాన్స్‌స్ట్రాయ్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న ధరకే ఆ పనులు చేపట్టేందుకు నవయుగ అంగీకరించింది. ఈ నేపథ్యంలో గురువారం తెరవాల్సిన టెండర్లను వారం రోజులపాటు వాయిదా వేయాలని జల వనరుల శాఖ నిర్ణయించింది. నవయుగ, ట్రాన్స్‌స్ట్రాయ్ మధ్య అవగాహన కుదిరి లిఖిత పూర్వకంగా అంగీకారం తెలియజేశాక.. అధికారికంగా ప్రభుత్వం దీనిపై ప్రకటన చేస్తుంది.